News June 3, 2024
అనంతపురాన్ని 8 గ్రిడ్‌లుగా విభజించి మూడంచెల భద్రత: ఎస్పీ
అనంతపురం నగరం 16 చదరపు కిలో మీటర్లు ఉండగా 8 గ్రిడ్లుగా విభజించామని జిల్లా ఎస్పీ గౌతమి శాలి పేర్కొన్నారు. ఒక్కో గ్రిడ్‌కు ఒక ఇన్‌ఛార్జ్ అధికారిని నియమించి మొబైల్, స్టాటిక్ పికెట్లు పరిశీలించేలా చర్యలు తీసుకున్నామన్నారు. 1వ గ్రిడ్‌లో ఉన్న జేఎన్టీయూ (కౌంటింగ్ కేంద్రం) చుట్టూ సీఏపీఎఫ్, ఏపీఎస్పీ, సివిల్ పోలీసులతో మూడంచెల భద్రత ఏర్పాటు చేశామన్నారు.
Similar News
News September 20, 2024
కూటమి పాలనలో సంక్షేమ పథకాలన్నీ రద్దు: అనంత వెంకటరామిరెడ్డి
కూటమి పాలనలో సంక్షేమ పథకాలన్నీ రద్దయ్యాయని అనంతపురం మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. 100 రోజుల పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో వెనక్కు.. అవినీతిలో ముందుకు వెళ్లిందని విమర్శించారు. ఖరీఫ్ ముగిసి రబీ ప్రారంభమవుతున్నా పెట్టుబడి సాయం అందలేదని అన్నారు. జిల్లాలో ఎక్కడ చూసినా మట్టి, ఇసుక దోపిడీ జరుగుతోందని ఆరోపించారు.

కూడేరు ఎంఈఓపై సస్పెన్షన్ వేటు
రెండు రోజుల క్రితం అనంతపురంలో రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన కూడేరు మండల విద్యాశాఖ అధికారి చంద్రశేఖర్‌ను సస్పెండ్ చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి తెలిపారు. ఈ మేరకు కడప ఆర్జేడీ గురువారం సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేశారని పేర్కొర్నారు. గోటుకూరు వద్ద గల వెరీ డైన్ ఏ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం నుంచి లంచం డిమాండ్ చేశాడనే కారణంతో సస్పెండ్ చేశామన్నారు.