News April 6, 2024
అనంతలో అమాంతం పెరిగిన టమాటా ధరలు

అనంతపురంలో టమాటా ధర కొండెక్కింది. కిలో ధర రూ.50కు చేరింది. నెలలుగా కిలో రూ.20లు దాటని ధర అమాంతం పెరిగింది. టమాటా సాగు చేస్తున్న రైతులు, టోకు వ్యాపారులను పెరిగిన టమాటా ధర ఆనందం కల్గిస్తుంటే.. సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News December 27, 2025
ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి: అనంత కలెక్టర్

ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్ఠమైన భద్రత ఉండాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. శనివారం అనంతపురం నగరంలోని పాత ఆర్డీవో కార్యాలయం కాంపౌండ్ పక్కనున్న ఈవీఎం గోడౌన్లను ఆయన తనిఖీ చేశారు. ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీల్లో భాగంగా ఈవీఎంలను భద్రపరిచిన గోడౌన్లను జిల్లా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఈవీఎం గోడౌన్ వద్ద భద్రతా చర్యలను, లాక్‌బుక్‌లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
News December 27, 2025
చీనీ పంటలో తెగుళ్లు

అనంతపురం జిల్లాలో చీనీ రైతులు ఆందోళన చెందుతున్నారు. చలి మొదలైనప్పటి నుంచి పంటకు మంగు తెగులు, పొలుసు పురుగు ఆశించడంతో కాయ నల్లగా మారుతోంది. ఇది పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతుందని రైతులు వాపోతున్నారు. తాడిపత్రి పరిధిలో చీనీ పంట అధిక సంఖ్యలో సాగులో ఉంది. తెగుళ్ల నివారణకు ప్రతి 15 రోజులకు ఒకసారి మందులను క్రమం తప్పకుండా పిచికారీ చేయాలని ఉద్యాన అధికారులు సూచిస్తున్నారు.
News December 26, 2025
డిసెంబర్ 31నే పింఛన్ల పంపిణీ: అనంతపురం కలెక్టర్

ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీకి సర్వం సిద్ధం చేసినట్లు అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు. జిల్లాలోని 2,78,388 మందికి రూ.124.47 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు డిసెంబర్ 31న ఉదయం 6:30 గంటల నుంచి సచివాలయ సిబ్బంది నేరుగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్లు అందజేయాలని ఆదేశించారు. జనవరి 1న న్యూ ఇయర్ కావడంతో ఒకరోజు ముందే పంపిణీ చేస్తున్నారు.


