News September 17, 2024

అనంతలో క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్‌కు ఘన స్వాగతం

image

అనంతపురానికి టీమిండియా క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ మంగళవారం చేరుకున్నారు. బెంగళూరు నుంచి రోడ్డు మార్గాన అనంతపురం చేరుకున్న ఆయనకు జిల్లా వాసులు ఘన స్వాగతం పలికారు. ఆయన నేరుగా పట్టణంలోని మాసినేని గ్రాండ్ హోటల్‌కు వెళ్లారు. సూర్యకుమార్ యాదవ్‌ను చూసేందుకు క్రికెట్ అభిమానులు బారులు తీరారు.

Similar News

News October 15, 2025

అనంతలో కేరళ రాష్ట్ర మాజీ ఆరోగ్య శాఖ మంత్రి పర్యటన

image

కేరళ ఆరోగ్య శాఖ మాజీ మంత్రి, అఖిల భారత ప్రజాస్వామ్య మహిళా సంఘం జాతీయ అధ్యక్షుడు పీకే, ఐద్వా జాతీయ ప్రధాన కార్యదర్శి మరియం ధవాలే అనంతపురం నగరానికి విచ్చేశారు. అనంతపురంలో ఉన్న పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి నివాసానికి వెళ్లారు. ప్రజా సమస్యలపై సింధూర అసెంబ్లీలో తమ గళాన్ని వినిపించాలన్నారు.

News October 14, 2025

స్నేహితుడిని రాయితో కొట్టి చంపిన వ్యక్తి అరెస్ట్

image

గుంతకల్లు 2 టౌన్ PS పరిధిలో స్నేహితుడు ఆనంద్(30) హత్య కేసులో నిందితుడు సయ్యద్ సలీంను (తిలక్ నగర్) పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 12న తెల్లవారుజామున బస్టాండ్‌లో మద్యం తాగుతున్న సమయంలో సలీం కుటుంబాన్ని ఆనంద్ దుర్భాషలాడటంతో ఆగ్రహించిన సలీం.. ఆనంద్‌ను రాయితో తలపై కొట్టి హత్య చేసీనట్లు టూ టౌన్ ఇన్‌ఛార్జ్ సీఐ మనోహర్ వెల్లడించారు. సలీంను మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని తెలిపారు.

News October 14, 2025

సామాజిక బాధ్యతగా మొక్కలు నాటాలి: కలెక్టర్ ఆనంద్

image

ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా మొక్కలు పెంచాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 3 లక్షలకు పైగా మొక్కలు నాటడానికి ప్రణాళికలు తయారు చేయాలని పేర్కొన్నారు. ప్రతి శాఖ నుంచి 3 వేలు పైగా మొక్కలు నాటలని ఆదేశించారు. అటవీ శాఖ 1.50 లక్షల మొక్కలు నాటాలని పేర్కొన్నారు.