News April 12, 2024
అనంతలో చీనీ టన్ను ధర రూ.38 వేలు

అనంత వ్యవసాయ మార్కెట్ యార్డు సంతలో చీనీ కాయల ధరలు పెరగడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఈ నెల 7న టన్ను రూ.35 వేలు ఉండగా 8న రూ.38 వేలకు పలికింది. ఈనెల 9న రూ.36 వేలు, 10న రూ.37 వేలు, 11న రూ.38 వేలు ధర పలికింది. మూడ్రోజులుగా టన్ను రూ.1000 చొప్పున ధర పెరుగుతూనే ఉంది. విక్రయాలు తగ్గడంతో ధరలు పెరిగాయని వ్యాపారవర్గాలు తెలిపాయి. గురువారం కాస్తా విక్రయాలు పెరిగాయి. మొత్తం 219 టన్నులు వచ్చాయి.
Similar News
News March 20, 2025
ATP: భార్య చెవి కోసి కమ్మలు తీసుకెళ్లిన భర్త

మద్యానికి బానిసైన ఓ వ్యక్తి దారుణానికి బరితెగించారు. కట్టుకున్న భార్య చెవి కోసి అమ్మడానికి కమ్మలు తీసుకెళ్లిన ఘటన అనంతపురం(D)లో జరిగింది. పెద్దపప్పూరు మం. వరదాయపల్లికి చెందిన శ్రీనివాసులు మద్యానికి బానిసయ్యాడు. ఈ నెల 17న మద్యం మత్తులో భార్య చెవిని కోసి కమ్మలు తీసుకెళ్లడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నేడు నిందితుడిని అరెస్ట్ అరెస్టు చేసి రిమాండ్‌కి పంపినట్లు SI నాగేంద్ర ప్రసాద్ తెలిపారు.
News March 20, 2025
700 మందితో కదిరి బ్రహ్మోత్సవాలలో బందోబస్తు

శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరిలో గురువారం సాయంత్రం జరిగే రథోత్సవానికి 700 మందితో బందోబస్తు చేపట్టినట్టు ఎస్పీ రత్న పేర్కొన్నారు. 6 మంది డీఎస్పీలు, 20 మంది సీఐలు, 40 మంది ఎస్ఐలు, 500 మంది సివిల్ పోలీస్ సిబ్బందితో పాటు 100 మంది స్పెషల్ పార్టీ, ఆర్మూర్ రిజర్వుడ్ పార్టీ, 90 మంది ఏపీఎస్పీ పార్టీలతో బందోబస్తు నిర్వహించనున్నామని తెలిపారు. మరో 60 మంది మఫ్టీ పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
News March 20, 2025
రెండో రోజు 352 మంది గైర్హాజరు

అనంతపురం జిల్లా వ్యాప్తంగా బుధవారం పదో తరగతి విద్యార్థులకు సెకండ్ లాంగ్వేజ్ ఎగ్జామ్ జరిగింది. 135 కేంద్రాల్లో పరీక్షలు జరగ్గా 352 మంది గైర్హాజరు అయ్యారు. 30,862 మందికి గానూ 30,537 మంది హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ డా.వినోద్ కుమార్ రాంనరగ్‌లోని శ్రీచైతన్య పాఠశాలలో A, B పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు.