News June 27, 2024

అనంతలో డయేరియా కోసం ప్రత్యేక వార్డు ఏర్పాటు

image

అనంతపురం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సరోజన ఆసుపత్రిలో 15 పడకలతో డయేరియా కోసం ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసినట్లు సూపర్ హిట్ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా డయేరియా కేసులు అధికం అవుతుండటంతో మెరుగైన వైద్య చికిత్సలు అందించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. డయేరియా పట్ల నిర్లక్ష్యం వహించకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు.

Similar News

News October 8, 2024

శ్రీ సత్యసాయి జిల్లాలో దారుణ హత్య

image

శ్రీ సత్యసాయి జిల్లాలో దారుణ హత్య జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. అమడగూరు మండలంలోని సుబ్బయ్య నారవపల్లి గ్రామ సమీపంలో రామలక్ష్మమ్మ (52) అనే వివాహితను ఓ తోటలో దుండగులు హత్య చేశారు. మృతురాలి స్వస్థలం పెనుకొండగా తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News October 8, 2024

అనంత జిల్లాలో రోడ్డు ప్రమాదం.. UPDATE

image

అనంతపురం జిల్లా పామిడి పట్టణ శివారులోని శ్రీనివాస మిల్క్ డైరీ సమీపంలో గల 44 నంబర్ జాతీయ రహదారిపై సోమవారం బైక్‌ను ఐచర్ వాహనం ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో పామిడిలోని అంబేడ్కర్ కాలనీకి చెందిన లాలెప్ప తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందారు. మృతుడు గుత్తి ఏపీ మోడల్ స్కూలులో అటెండర్‌గా పని చేస్తున్నారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

News October 8, 2024

మంత్రి భరత్‌ను కలిసిన ఎంపీ అంబిక

image

రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ను అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మినారాయణ మర్యాదపూర్వకంగా కలిశారు. కర్నూలులోని మంత్రి నివాసంలో కలిసి జిల్లాలో సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. అనంతపురం నగరాన్ని పారిశ్రామిక వాడగా తీర్చిదిద్దాలని కోరారు. పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు.