News September 25, 2024
అనంతలో ‘లేపాక్షి’ పేరు అలా.. వచ్చిందట!

అబ్బురపరిచే శిల్ప సంపదకు నిలయం అనంతలోని లేపాక్షి ఆలయం. నందీశ్వరుడి విగ్రహాన్ని చూడటానికి రెండు కళ్లూ సరిపోవు. ఉట్టిపడే రాజసం ఈ విగ్రహం సొంతం. ఈ ఆలయంలో వేలాడే స్తంభం ముఖ్య ఆకర్షణ. పర్యాటకులు ఈ అద్భుతాన్ని చూసి పరీక్షిస్తుంటారు. 7 పడగల భారీ నాగేంద్రుడు వంటి ఎన్నో ఆశ్చర్యపరచే వింతలు ఇక్కడున్నాయి. రాముడు జటాయు పక్షిని ‘లే పక్షీ’ అని పిలవడంతో ఈ ఊరికి ‘లేపాక్షి’ అనే పేరు వచ్చిందని చరిత్ర చెబుతోంది.
Similar News
News October 20, 2025
వైసీపీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలిగా రాధ

గుత్తి ఆర్ఎస్లోని ఎస్ఎస్ పల్లికి చెందిన చంద్రగిరి రాధను వైసీపీ మహిళా విభాగం అనంతపురం జిల్లా ఉపాధ్యక్షురాలిగా నియమించారు. ఈ మేరకు ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. రాధ ఎంపిక పట్ల వైసీపీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని రాధ అన్నారు.
News October 19, 2025
పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్త వహించండి: ఎస్పీ

అనంతపురం జిల్లా ప్రజలకు, జిల్లా పోలీసు సిబ్బందికి ఎస్పీ జగదీశ్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ దీపావళి మీ జీవితాలలో చీకట్లను పారదోలి మరిన్ని కాంతులు నింపాలని ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా జరుపుకునే ఈ దీపావళి పర్వదినాన ఆనవాయితీగా వచ్చే బాణసంచాను సరైన జాగ్రత్తలతో కాల్చాలని సూచించారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు.
News October 19, 2025
రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు: కలెక్టర్

అనంతపురం కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికను రద్దు చేసినట్లు కలెక్టర్ ఆనంద్ ఆదివారం ప్రకటించారు. సోమవారం దీపావళి సందర్భంగా ప్రభుత్వ సెలవు ఉన్నందున ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించడం లేదని తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు.