News December 21, 2024
అనంతలో విషాదం.. యువకుడి సూసైడ్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1734700126408_20669948-normal-WIFI.webp)
అనంతపురంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసముండే కురుబ శివా అనే యువకుడు శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
Similar News
News January 16, 2025
పక్షుల కోసం 1.40 లక్షల మానవ నిర్మిత గూళ్ల ఏర్పాటు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737029503046_60339041-normal-WIFI.webp)
పక్షులను రక్షించడానికి 1.40 లక్షల మానవ నిర్మిత గూళ్లు ఏర్పాటు చేసి హార్వర్డ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదు కావడం అభినందనీయమని అనంతపురం కలెక్టర్ డా.వినోద్ కుమార్ పేర్కొన్నారు. గ్రీన్ ఆర్మీ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో అనిల్ కుమార్ అచ్చుల కోసం గూళ్లను ఏర్పాటు చేయడంపై కలెక్టర్ అభినందించారు. ఇందుకు హార్వర్డ్ వరల్డ్ రికార్డ్ వారు సర్టిఫికెట్ ఇచ్చారన్నారు.
News January 16, 2025
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలి: కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737025922939_52010457-normal-WIFI.webp)
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. గురువారం పుట్టపర్తి కలెక్టరేట్‌లోని మినీ కన్ఫరెన్స్ హాల్లో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి బ్యాంకర్లు కేటాయించిన లక్ష్యాలను నెల రోజుల్లోగా తప్పనిసరిగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రుణాల మంజూరులో 100 శాతం లక్ష్యాలు చేరుకోవాలన్నారు.
News January 16, 2025
పారదర్శకంగా కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు: ఎస్పీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737021473387_20669948-normal-WIFI.webp)
అనంతపురంలోని నీలం సంజీవరెడ్డి మైదానంలో గురువారం ఉదయం ప్రారంభమైన పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలను ఎస్పీ జగదీశ్ పర్యవేక్షించారు. ఆయన మాట్లాడుతూ.. కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు పారదర్శకంగా కొనసాగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి పకడ్బందీగా ఈ పరీక్షలు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు.