News January 8, 2025

అనంతలో విషాదం.. వివాహిత ఆత్మహత్య

image

అనంతపురంలో విషాదం చోటు చేసుకుంది. నగరంలోని వేణుగోపాల్ నగర్‌లో ఉండే పుష్పావతి అనే వివాహిత కుటుంబ కలహాల నేపథ్యంలో ఉరివేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News January 18, 2025

అనంతపురం ఎంపీపై సీఎం ఆగ్రహం!

image

సీఎం చంద్రబాబు అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న ఉండవల్లిలోని తన నివాసంలో మంత్రులు, ఎంపీలతో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన గైర్హాజరయ్యారు. పార్టీ సమావేశం కంటే ఇతర పనులే ముఖ్యమా? అని సీఎం మండిపడ్డారు. ఇలాంటి సమావేశాలకు ఎంపీలు రాకపోవడం ఏంటని టీడీపీ పార్లమెంటరీ నేత శ్రీకృష్ణదేవరాయలును ప్రశ్నించారు. ఇకపై మారకుంటే కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని హెచ్చరించినట్లు సమాచారం.

News January 18, 2025

ప్రతి మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమం: కలెక్టర్

image

నెలలో ప్రతి మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించనున్నామని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేత పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని అన్ని మండలాలు, మున్సిపాలిటీలకు చెందిన అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహించడానికి అందరూ అంకితభావంతో భాగస్వామ్యం కావాలని కలెక్టర్ సూచించారు.

News January 17, 2025

సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించాలి: కలెక్టర్

image

ఫిబ్రవరి 13, 14, 15వ తేదీల్లో సేవాఘడ్లో సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం అనంతపురం రెవెన్యూ భవనంలో ఫిబ్రవరిలో గుత్తి పరిధిలో నిర్వహించే సంత్ సేవాలాల్ 286వ జయంతి ఉత్సవాలపై ఆయాశాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. బంజారాల ఆరాధ్య దైవమైన సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలను ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించాలన్నారు.