News September 17, 2024
అనంతలో విషాదం.. వివాహిత ఆత్మహత్య
అనంతపురంలో విషాదం చోటుచేసుకుంది. నగరంలోని ఐదో రోడ్లో నివాసం ఉండే అనిత అనే వివాహిత సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన స్థానికులు ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Similar News
News October 13, 2024
‘మద్యం దుకాణాల లాటరీ సందర్భంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు’
పుట్టపర్తిలో సోమవారం జరిగే మద్యం దుకాణాల లాటరీ సందర్భంగా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్టు జిల్లా ఎస్పీ రత్న పేర్కొన్నారు. ఆదివారం రాత్రి పోలీస్, ఎక్సైజ్ అధికారులతో ఎస్పీ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. టెండర్ల సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నియమ నిబంధనల గురించి తెలిపారు. మద్యం దుకాణాల టెండర్లకు సంబంధించి ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు.
News October 13, 2024
గొల్లపల్లి రిజర్వాయర్‌లో పడి వ్యక్తి మృతి
పెనుకొండ మండల పరిధిలోని గొల్లపల్లి రిజర్వాయర్‌లో పడి హిందూపురం మండలం లింకంపల్లి గ్రామానికి చెందిన హానిస్ ఖాన్(42) ఆదివారం మృతిచెందారు. ఎస్ఐ రాజేశ్ వివరాల మేరకు.. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలసి గొల్లపల్లి రిజర్వాయర్‌కు వెళ్లి ప్రమాదవశాత్తూ కాలు జారి అందులో పడిపోయాడు. స్నేహితులు, కుటుంబ సభ్యులు కాపాడే లోపే మరణించినట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
News October 13, 2024
రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు: కలెక్టర్
శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికను రద్దు చేసినట్టు కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. రేపటి నుంచి 16వ తేదీ వరకు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రత్యేక అధికారులు ఆయా మండలాల్లో ఉండాలని ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఈ వారం రద్దు చేసినట్లు తెలిపారు.