News February 2, 2025
అనంతలో విషాదం.. వ్యక్తి ఆత్మహత్య

అనంతపురంలోని పాపంపేట కాలనీలో బాబుల్లా అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సమస్యల కారణంగా శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు.
Similar News
News February 15, 2025
ప్రజా సమస్యలపై ప్రతి ఒక్కరూ గళమెత్తాలి: రామకృష్ణ

ప్రజా సమస్యలపై ప్రతి ఒక్కరూ తమ గళం వినిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. గుంతకల్లు పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఆయన సమావేశం నిర్వహించారు. స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నాయకులు పోరాడాలని సూచించారు. ఎంతో మంది పేదలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం వారిని ఆదుకోవాలని సూచించారు.
News February 14, 2025
అనంత: ‘బాయ్ ఫ్రెండ్ నా నంబర్ బ్లాక్ చేశాడు.. డయల్ 100కు యువతి ఫోన్’

డయల్ 100కు ఫోన్ చేసి ఓ యువతి సాయం కోరడం చర్చనీయాంశమైంది. ‘సార్.. నా బాయ్ ఫ్రెండ్ నా నంబర్ బ్లాక్ చేసి మాట్లాడట్లేదు. వాడితో మాట్లాడి అన్‌బ్లాక్ చేయించండి’ అని గుత్తి ఆర్ఎస్‌కు చెందిన యువతి కోరింది. కంట్రోల్ రూమ్ వారు స్థానిక పోలీసులకు తెలపడంతో కానిస్టేబుల్ సుధాకర్ ఆమెను సంప్రదించారు. అయితే తన ఇంటికి రావొద్దని, వాడితో మాట్లాడి అన్‌బ్లాక్ చేయించాలని కోరడంతో బాయ్ ఫ్రెండ్‌తో మాట్లాడేందుకు యత్నించారు.
News February 14, 2025
అనంత: ప్రణతికి డాక్టరేట్

అనంతపురానికి చెందిన ఓ.ప్రణతి గురువారం డాక్టరేట్ డిగ్రీ పొందారు. హైదరాబాదులోని సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్(CESS)లో ప్రొఫెసర్ బలరాములు పర్యవేక్షణలో ‘పట్టణ, గ్రామీణ రాజకీయాలలో మహిళల పాత్ర’ అనే అంశంపై ప్రణతి చేసిన పరిశోధనకు డాక్టరేట్ ప్రదానం చేశారు. అవార్డు అందుకున్న ఆమెను సిబ్బంది అభినందించారు.