News December 12, 2024
అనంతసాగరం: తండ్రి, కుమారుల గొడవ.. కొడుకు మృతి

అనంతసాగరం మండలం ఇనగలూరులో తండ్రి-కొడుకుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో కొడుకు మృతి చెందాడు. కొడుకు మస్తాన్ రోజు మద్యం సేవించి ఇంటికి వస్తుండేవాడు. దీనితో తండ్రి నబ్బీసాహెబ్ మందలించాడు. ఈ క్రమంలో తండ్రి పై కర్రతో దాడి చేయబోయి పక్కనే ఉన్న రాళ్ల పై పడి కొడుకుకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మస్తాన్ మృతి చెందాడు.
Similar News
News November 30, 2025
తెరపైకి దక్షిణ నెల్లూరు జిల్లా..!

స్లాంగ్, కల్చర్కు పూర్తి విభిన్నంగా ఉండే గూడూరును తిరుపతి జిల్లాలో కలిపారు. రాపూరు, కలువాయి, సైదాపురం సైతం ఇదే జిల్లాలో విలీనం చేయడాన్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. ‘రాయలసీమ వద్దు.. నెల్లూరు ముద్దు’ అనే నినాదంతో సోషల్ మీడియా వేదికగా ఉద్యమిస్తున్నారు. నెల్లూరులో కలిపి వీలు లేకుంటే.. గూడూరు కేంద్రంగా దక్షిణ నెల్లూరు జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ను అక్కడి ప్రజలు తెరపైకి తెచ్చారు.
News November 30, 2025
సైబర్ నేరాలు తగ్గేందుకు కృషి చెయ్యాలి : SP అజిత

సైబర్ నేరాలను తగ్గించేందుకు బ్యాంకర్లు తమకు సహకరించాలని SP అజిత కోరారు. జిల్లాలోని బ్యాంకు మేనేజర్లు, కోఆర్డినేటర్లతో ఆమె సమన్వయ సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం పెరుగుతున్న సైబర్ నేరాలను తగ్గించే విధానం, బ్యాంకులు ప్రజలకు ఎలా అవగాహన కల్పించాలి అనే దానిపై చర్చించారు. జిల్లాలోని ప్రజల ఆర్థిక రక్షణ కోసం పోలీస్ మరియు బ్యాంకులు కలిసి పనిచేయాల్సిన అవసరం ఎక్కువైందన్నారు.