News October 23, 2024
అనంతసాగరం తహశీల్దారును సస్పెండ్ చేసిన కలెక్టర్
అనంతసాగరం తహశీల్దార్ కె.వీరవసంత రావును కలెక్టర్ సస్పెండ్ చేశారు. పొదలకూరు మండలంలో తహశీల్దారుగా విధులు నిర్వహిస్తున్న సమయంలో రెవెన్యూ సమస్యలపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో విచారణ చేసిన నెల్లూరు కలెక్టర్ ఆనంద్ బుధవారం తహశీల్దార్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Similar News
News January 11, 2025
BREAKING: తిరుపతిలో వ్యక్తిపై చిరుత పులి దాడి
ముని కుమార్ అనే వ్యక్తిపై చిరుత పులి దాడి చేసిన ఘటన తిరుపతిలోని సైన్స్ సెంటర్ ఎదురుగా చోటు చేసుకుంది. దీంతో బాధితుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. బైక్‌పై వెళ్తుండగా ఒక్కసారిగా మునికుమార్‌పై చిరుత దాడిచేయడంతో కిందపడ్డాడు. గుర్తించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పట్టపగలే చిరుత దాడి చేయడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
News January 11, 2025
నెల్లూరులో వివాహిత ఆత్మహత్య
కుమారుడిని అత్త మందలించిందని ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్నట్లు నెల్లూరు పోలీసులు తెలిపారు. నగరానికి చెందిన రుబీనా(22) అంజద్‌కు మూడేళ్ల క్రితం వివాహం అయింది. వారికి ఇద్దరు పిల్లలు. రుబీనా రెండేళ్ల కుమారుడు సోఫాపై మూత్రం పోశాడు. దీంతో అత్త బాలుడిని మందలించింది. మనస్తాపం చెందిన రుబీనా ఇంట్లో ఉరి వేసుకుంది. కుబుంబీకులు గమనించి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.
News January 11, 2025
ప్రైవేట్ బస్సులకు అనుమతులు ఇస్తాం: కలెక్టర్
నెల్లూరు నగరంతో పాటు జిల్లాలోని ఇతర పట్టణాల్లో ప్రైవేట్ బస్సులు నడిపేందుకు ఆసక్తి ఉన్నవారు ముందుకు వస్తే వెంటనే అనుమతిస్తామని జిల్లా కలెక్టర్ ఒ. ఆనంద్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో ప్రాంతీయ రవాణా ఆథారిటీ సమావేశం నిర్వహించారు. నెల్లూరు నగరంలో ఇప్పటికే పర్మిట్ ఉన్న రూట్లు, నూతన రూట్లలో సిటీ బస్‌లు తిప్పుకునేందుకు ప్రైవేట్ ఆపరేటర్లు అనుమతుల కోసం చేసిన దరఖాస్తులను ఆయన పరిశీలించారు.