News July 14, 2024
అనంత్ అంబానీకి విశాఖ ఎంపీ ఆశీర్వచనాలు
అంబానీ ఇంట పెళ్లికి విశాఖ ఎంపీ హాజరయ్యారు. అంబానీ కుమారుడు అనంత్ అంబానీ- రాధిక వివాహ వేడుకకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో పాటు ఎంపీ శ్రీభరత్ వెళ్లారు. నూతన దంపతులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని పాల్గొన్నారు.
Similar News
News October 16, 2024
కసింకోట నేషనల్ హైవేపై యాక్సిడెంట్.. ఇద్దరు స్పాట్‌డెడ్
కసింకోట జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున యాక్సిడెంట్ జరిగింది. ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న కసింకోట పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. డివైడర్‌ను ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. మృతులు నక్కపల్లి ప్రాంతానికి చెందినవారిగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News October 16, 2024
17న నీతి అయోగ్ సీఈవో విశాఖ రాక
ఈనెల 17వ తేదీన నీతి అయోగ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి బీవీఆర్ సుబ్రహ్మణ్యం విశాఖ వస్తున్నారు. ఆయన ఢిల్లీ నుంచి రాత్రి 10.15 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన నగరానికి వెళ్లి బస చేస్తారు. 18వ తేదీన సీఈవో పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అదే రోజు రాత్రి 11.10 గంటలకు తిరిగి ఢిల్లీ వెళతారు.
News October 16, 2024
సిరిమానును తిలకించిన విశాఖ ఎంపీ
విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవంలో విశాఖ ఎంపీ శ్రీభరత్ పాల్గొన్నారు. కేంద్ర మాజీ మంత్రి, ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజుతో కలిసి కోట నుంచి సిరిమానును ఆయన తిలకించారు. వారితో పాటు రాజ కుటుంబీకులు, జిల్లా ప్రజాప్రతినిదులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.