News March 23, 2024

అనంత: అత్యాచారం కేసులో నిందుతుడికి పదేళ్ల జైలు

image

గార్లదిన్నెలో కూరగాయల మండీలో కూలీగా అస్సాం రాష్ట్రానికి చెందిన పప్పుబాగ్ (రాజు) పని చేసేవాడు. ఈక్రమంలో 16 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేశాడు. 4నెలల గర్భవతిగా ఉండగా 2023 మే 26న బాలిక తల్లిదండ్రులు గార్లదిన్నె పోలీసుల ఫిర్యాదుతో పోక్సో చట్టం కింద కేసు నమోదుచేశారు. నేరం రుజువు కావడంతో పదేళ్లు జైలు, రూ.3 వేలు పొక్సో కోర్టు న్యాయమూర్తి రాజ్యలక్ష్మి తీర్పు వెల్లడించింది

Similar News

News April 24, 2025

ఇన్‌స్టా ప్రేమ.. మోసపోయిన అనంతపురం యువతి!

image

ప్రేమ పేరుతో అనంతపురం యువతిని మోసం చేసిన వ్యక్తిపై హైదరాబాద్ SR నగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై శ్రీనాథ్‌రెడ్డి వివరాల మేరకు.. అనంతపురం యువతికి SR నగర్‌లో ఉండే మురళి ఇన్‌స్టాలో పరిచయమయ్యాడు. అది ప్రేమగా మారింది. యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు హోటల్‌‌కు తీసుకెళ్లాడు. పెళ్లి ప్రస్తావన తేవడంతో ముఖం చాటేశాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.

News April 24, 2025

స్వచ్ఛతలో అనంతపురం జిల్లాకు అవార్డు

image

స్వచ్ఛ ఆంధ్ర అమలులో అనంతపురం జిల్లాకు అవార్డు దక్కింది. రాష్ట్రంలోనే తొలి స్థానంలో అనంతపురం, ద్వితీయ స్థానంలో సత్యసాయి జిల్లా నిలిచాయి. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ కృష్ణతేజ ప్రకటించారు. నేడు విజయవాడలో జరగనున్న జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంలో జిల్లా కలెక్టర్ డా.వినోద్ కుమార్ అవార్డును అందుకోనున్నారు.

News April 24, 2025

ఈతకు వెళ్లి బీఫార్మసీ విద్యార్థి మృతి

image

నెల్లూరు జిల్లాలో చదువుకుంటున్న అనంతపురం యువకుడు ఈతకు వెళ్లి మృతిచెందాడు. కళ్యాణదుర్గం మండలం గొల్ల గ్రామానికి చెందిన అంజి నార్త్ రాజుపాలెంలోని వేంకటేశ్వర ఇంజినీరింగ్ కాలేజీలో బీఫార్మసీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. కాలేజీకి సమీపంలోని రేగడిచిలక వద్ద బావి దగ్గరికి ఐదుగురు విద్యార్థులతో కలిసి ఈతకు వెళ్లాడు. ఈ క్రమంలో బావిలో మునిగి చనిపోయాడు.

error: Content is protected !!