News August 21, 2024

అనంత అదనపు ఎస్పీగా రమణమూర్తి బాధ్యతల స్వీకరణ

image

అనంతపురం జిల్లా అదనపు ఎస్పీగా రమణమూర్తి బుధవారం బాద్యతలు చేపట్టారు. సాధారణ బదిలీల్లో భాగంగా ఎస్పీ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టిన ఆయనకు కార్యాలయ సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ప్రజల శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా పని చేస్తామని తెలిపారు.

Similar News

News November 21, 2025

అనంతపురం మొదటి జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి సంచలన తీర్పు

image

గంజాయి సరఫరా, విక్రయాలకు పాల్పడిన ఐదుగురి ముఠాకు 10 ఏళ్లు జైలు శిక్ష, చెరో రూ.లక్ష జరిమానా విధిస్తూ అనంతపురం మొదటి జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి సంచలన తీర్పు వెలువరించారు. (గంగాధర్, స్వాతి, ప్రసాద్, షేక్ గౌసియా, షేక్ అలీ) నిందితులకు శిక్ష పడేలా కృషిచేసిన అధికారులు, సిబ్బందిని ఎస్పీ జగదీశ్ అభినందించారు. షేక్ అలీ గుంతకల్లు మండలం తిమ్మాపురం గ్రామం కాగా మిగిలిన నలుగురు అనంతపురానికి చెందినవారే.

News November 21, 2025

రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు నార్పల విద్యార్థి

image

రాష్ట్రస్థాయి అండర్-14 వాలీబాల్ పొటీలకు నార్పల జడ్పీ బాలికోన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని ఆఫ్రిన్ ఎంపికైనట్లు ప్రదానోపాధ్యాయుడు నాగేశ్ తెలిపారు. స్కూల్ గేమ్స్ ఆధ్వర్యంలో డిసెంబర్ 6వ తేదీ నుంచి నెల్లూరులో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థిని పాఠశాల ఉపాధ్యాయులు, పీడీలు అభినందించారు.