News September 6, 2024
అనంత: ‘అదృశ్యమైన వ్యక్తి శవమై కనిపించాడు’
బొమ్మనహాల్ మండలం దర్గా హోన్నూరుకు చెందిన రాజప్ప(32) ఈనెల 4న అదృశ్యమయ్యాడు. ఈ క్రమంలో శుక్రవారం గ్రామ శివారులోని పొలాల్లో శవమై కనిపించాడు. సమాచారం అందుకున్న ఎస్ఐ నబీ రసూల్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. రాజప్ప ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ఇతర ఏదైనా కారణం వల్ల మృతి చెందాడా? అనే కోణంలో విచారణ చేపట్టారు.
Similar News
News October 8, 2024
మంత్రి భరత్‌ను కలిసిన ఎంపీ అంబిక
రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ను అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మినారాయణ మర్యాదపూర్వకంగా కలిశారు. కర్నూలులోని మంత్రి నివాసంలో కలిసి జిల్లాలో సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. అనంతపురం నగరాన్ని పారిశ్రామిక వాడగా తీర్చిదిద్దాలని కోరారు. పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు.
News October 7, 2024
అనంతపురం జిల్లాలో 421 దరఖాస్తులు!
అనంతపురం జిల్లాలో మద్యం దుకాణాలకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. ఇప్పటివరకు అనంతపురం జిల్లాలో 136 మద్యం దుకాణాలకు గానూ 289, సత్యసాయి జిల్లాలో 87 దుకాణాలకు గానూ 132 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల స్వీకరణకు ఇక మూడు రోజులే గడువుంది. అయితే జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో ముఖ్యనేతలు మద్యం దుకాణాలకు ఎవరూ దరఖాస్తులు వేయొద్దని, వాటిని తమకు వదిలేయాలని వ్యాపారులను హెచ్చరిస్తున్నట్లు విమర్శలొస్తున్నాయి.
News October 7, 2024
లేపాక్షి: డివైడర్‌ను ఢీకొన్న కారు..ఇద్దరి మృతి
లేపాక్షి మండలంలోని చోళ సముద్రం సమీపంలో డివైడర్‌ను కారు ఢీకొని ఇద్దరు మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు. బ్రహ్మకుమారీ ఆశ్రమంలోని 8 మంది ఆదివారం ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు మడకశిర వెళ్లి తిరుగుముఖం పట్టారు. ఈ నేపథ్యంలో రోడ్డు కుంగి ఉండడంతో కారు బోల్తా పడింది. ఘటనలో గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. వారిలో ఎ. సరస్వతమ్మ, నారాయణమ్మలు మృతి చెందారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.