News August 25, 2024

అనంత: ‘ఆ ఆలయంలో అంతుబట్టని రహస్యాలెన్నో..’

image

అనంతపురం జిల్లా కుందుర్పిలోని ఓ పురాతన ఆలయంలో అంతుబట్టని రహస్యాలు దాగి ఉన్నాయి. ఇటీవల ఆలయ తలుపులు తెరిచి లోపలికి వెళ్లిన పురావస్తు శాఖ అధికారులు కొన్ని విలువైన రాతి విగ్రహాలను గుర్తించారు. అయితే లోపల వాతావరణం అనుకూలించకపోవడం, చీకటిగా ఉండటంతో బయటికి వచ్చి ఆలయానికి తాళం వేశారు. ఇప్పుడు ఆ ఆలయ చరిత్రపై సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. మరోసారి అధికారులు ఆలయం లోపలికి వెళ్లి పరిశీలించనున్నట్లు సమాచారం.

Similar News

News September 15, 2025

గుత్తిలో రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్ టోర్నమెంట్

image

గుత్తిలో ఈ నెల 25 నుంచి 27 వరకు రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. గౌతమీపురి ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుత్తి ఆర్ఎస్ రైల్వే ఇన్‌స్టిట్యూట్ క్రీడా మైదానంలో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల జట్లు కూడా పాల్గొననున్నట్లు నిర్వాహకులు వివరించారు. ఆసక్తి ఉన్నవారు ఈ నెల 18 లోపు పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.

News September 14, 2025

లోక్‌సభ ర్యాంకిగ్స్‌లో అనంతపురం MPకి 8ర్యాంక్

image

లోక్‌సభలో MPల పెర్ఫామెన్స్‌ రిపోర్ట్‌ను పార్లమెంట్ ఆదివారం విడుదల చేసింది. 2024 జూన్ 24 నుంచి 2025 ఏప్రిల్ 4వ తేదీ వరకు MPలు పాల్గొన్న డిబెట్‌లు, అడిగిన క్వశ్చన్స్, అటెండెన్స్ ఆధారంగా ఈ ర్యాంక్‌లు ఇచ్చింది. ఈ నివేదికలో అనంతపురం MP అంబికా లక్ష్మీనారాయణ 8వ స్థానంలో నిలిచారు. ఆయన లోక్‌సభలో మొత్తం 78 ప్రశ్నలు అడగగా, 8 చర్చల్లో పాల్గొన్నారు. కాగా ఆయన హాజరు శాతం 89.71గా ఉంది. ఆయన పనితీరుపై మీ కామెంట్..!

News September 14, 2025

వైద్యాధికారులతో అనంతపురం కలెక్టర్ సమావేశం

image

అనంతపురం జిల్లా కొత్త కలెక్టర్ ఆనంద్‌ను DMHO డాక్టర్ దేవి పుష్పగుచ్చంతో శనివారం స్వాగతించారు. కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన వెంటనే వైద్య అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ప్రభుత్వ వైద్యశాలల్లో రోగులకు అందుతున్న సేవలపై DMHOతో చర్చించారు. జిల్లాలో PHC, CHC, విలేజ్ హెల్త్ సెంటర్, క్లినిక్‌ల వివరాలను అడిగి తెలుసుకున్నారు.