News March 24, 2025
అనంత: ఈతకు వెళ్లి 10th విద్యార్థి మృతి.!

అనంతపురం రూరల్ పరిధిలోని రాచానపల్లి వద్ద ఉన్న చెక్‌డ్యాంలో ఈతకు వెళ్లిన విశ్వతేజ తిరిగిరాని లోకాలకు వెళ్లారు. సోమవారం 10వ తరగతి పరీక్ష రాసి స్నేహితులతో కలిసి చెక్ డ్యాంలో ఈతకు వెళ్లిన విశ్వతేజ మృతి చెందాడు. అతడికి ఫీట్స్ రావడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అనంతపురం రూరల్ పరిధిలోని మొబ్బు కొట్టాలలో వారి కుటుంబం నివసిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు.
Similar News
News September 18, 2025
ఈ బస్సులో స్త్రీ శక్తి పథకం వర్తించదు.. ఎక్కడో తెలుసా..!

రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచిత ప్రయాణం చేస్తున్నారు. కానీ అనంతపురం జిల్లాలో తాడిపత్రి నుంచి పుట్లూరు మీదుగా గరుగుచింతలపల్లికి వెళ్లే రూట్లో మాత్రం ఉచిత ప్రయాణం అమలు కావటం లేదు. ‘మా గ్రామాలకు ఒక్క బస్సు మాత్రమే ఉంది. దిక్కు లేక టికెట్ కొనుక్కుని వెళ్తున్నాం’ అని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News September 18, 2025
అనంత జిల్లాకు 1482.30 మెట్రిక్ టన్నుల యూరియా

అనంతపురం జిల్లాకు RCF సంస్థ నుంచి 1482.30 మెట్రిక్ టన్నుల యూరియా చేరుకుందని DA అల్తాఫ్ అలీ ఖాన్ తెలిపారు. ప్రసన్నాయిపల్లి రేట్ పాయింట్ వద్ద ఆయన యూరియాను పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు మార్క్‌ఫెడ్‌కు 899.01 మెట్రిక్ టన్నులు, ప్రైవేట్ డీలర్లకు 583.29 మెట్రిక్ టన్నులు కేటాయించామని వెల్లడించారు.
News September 17, 2025
అనంత నుంచి అమరావతికి 45 బస్సులు.. 2,100 మంది సిద్ధం

అనంతపురం జిల్లాలో డీఎస్సీ అభ్యర్థులు నియామక పత్రాలు అందించే కార్యక్రమానికి ఏర్పాట్లను పూర్తి చేసినట్లు కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. ఈనెల 19న అమరావతిలో డీఎస్సీకి ఎంపికైన అభ్యర్థులకు జిల్లా నుంచి 45 బస్సులు ఏర్పాటు చేశామన్నారు. అందులో వారి కుటుంబ సభ్యులు, విద్యాశాఖ అధికారులు.. మొత్తం 2,100 అమరావతికి వెళ్లనున్నట్లు తెలిపారు.