News April 8, 2024

అనంత: ఈనెల 21న విద్యార్థలకు ప్రవేశ పరీక్ష

image

ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 25 ఏపీ మోడల్ స్కూల్‌‌లలో ఆరో తరగతి ప్రవేశానికి దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఒక్కో పాఠశాలలో ఆరో తరగతికి 100 సీట్లు కేటాయించారు. మొత్తం 25 పాఠశాలల్లో 2500 సీట్లు గాను, 5137 దరఖాస్తులు వచ్చాయి. ఇందుకు సంబంధించి ఈ నెల 21న ఆయా పాఠశాలల్లో విద్యార్థులకు ప్రవేశ పరీక్ష నిర్వహించి అర్హులైన వారికి సీట్లు కేటాయిస్తారు.

Similar News

News January 24, 2025

కూడేరు: జైలు నుంచి దున్నపోతు రిలీజ్

image

కూడేరు మండలం కడదరకుంట, ముద్దలాపురం గ్రామాల్లో దేవర కోసం రెండు దున్నపోతులను గతంలో వదిలారు. అయితే వాటిలో ఒకటి పారిపోగా.. మరొక దానికోసం రెండు గ్రామాల మధ్య వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. దీంతో సీఐ రాజు పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆ దున్నపోతును వారి ఆధీనంలోకి తీసుకున్నారు . కాగా ఇటీవల దేవర ముగియడంతో గురువారం దున్నపోతును వదిలేశారు. ఇక మీదట బలి ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

News January 24, 2025

పెండింగ్ పనులను పరిష్కరించండి: కలెక్టర్ చేతన్

image

శ్రీ సత్యసాయి జిల్లాలో జరుగుతున్న రహదారులకు సంబంధించి పెండింగ్ పనులను సత్వరమే పూర్తి చేయించాలని జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో జాతీయ రహదారులు, రైల్వేలు, అటవీశాఖ, చిన్న నీటిపారుదలపై అధికారులతో సమీక్షించారు. పెండింగ్ సమస్యలను వారంలోపు పరిష్కరించాలని ఆదేశించారు.

News January 23, 2025

రొళ్లలో యువకునిపై పోక్సో కేసు

image

రొళ్ల మండలంలోని ఓ గ్రామానికి చెందిన కిరణ్‌పై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ బాలాజీ తెలిపారు.17 ఏళ్ల వయసున్న బాలిక ఈనెల 2వ తేదీ నుంచి అదృశ్యమైనట్లు బాలిక తల్లిదండ్రులు 4వ తేదీన ఫిర్యాదు చేశారు. ఈ ఘటన దర్యాప్తులో ఉండగా బుధవారం సాయంత్రం బాలిక ఇంటికి చేరుకొని కిరణ్ అత్యాచారం చేసినట్లు తల్లిదండ్రులకు చెప్పింది. దీనిపై వారు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.