News March 30, 2025
అనంత: ఉగాది, రంజాన్ ఎఫెక్ట్.. పెరిగిన ధరలు

నేడు ఉగాది, రేపు రంజాన్ పండుగ సందర్భంగా అనంతపురం జిల్లాలో చికెన్ ధరలు స్వల్పంగా పెరిగాయి. గుత్తిలో కేజీ రూ.180-190గా ఉంది. గుంతకల్లులో కిలో రూ.150-160 చొప్పున అమ్ముతున్నారు. ఇక అనంతపురంలో కేజీ రూ.140-150తో విక్రయిస్తున్నట్లు చికెన్ షాప్ నిర్వాహకులు తెలిపారు. గత ఆదివారంతో పోల్చితే నేడు చికెన్ ధరలు స్వల్పంగా పెరిగాయి. గుత్తి, గుంతకల్లులో కేజీ మటన్ ధర రూ.700 నుంచి రూ.750గా ఉంది.
Similar News
News November 25, 2025
అనంత: ఆ నిందితులకు 14 రోజుల రిమాండ్

అనంతపురం సాయి నగర్ 3rd క్రాస్‌లోని శ్రీనివాస మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌పై దాడిచేసి ధ్వంసం చేసిన ఘటనలో అడ్వకేట్ మొగలి సత్యనారాయణరెడ్డితోపాటు మొత్తం ఏడుగురుని అరెస్టు చేసినట్లు 2 టౌన్ సీఐ శ్రీకాంత్ తెలిపారు. నిందితులను 14 రోజులపాటు రిమాండ్‌కు తరలించామన్నారు. దాడికి ఉపయోగించిన మూడు కార్లు ఒక మోటార్ సైకిల్ మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వివరించారు.
News November 25, 2025
అనంత: ప్రతి శుక్రవారం ఫ్రైడే, డ్రైడే కార్యక్రమాలు

అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ ప్రతి శుక్రవారం ఫ్రైడే, డ్రైడే కార్యక్రమాలు నిరంతరం కొనసాగించాలని పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ‘జిల్లాలోని అన్ని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, సచివాలయాలు, RTC బస్‌స్టాండ్ ప్రాంతాల్లో కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌లను కట్టించాలని కలెక్టర్ అన్నారు.