News October 30, 2024
అనంత: ఉద్యోగం రాలేదని యువతి ఆత్మహత్య
బెలుగుప్ప మండలం జీడిపల్లికి చెందిన నవ్య(22) ఉద్యోగం రాలేదని మనస్తాపం చెంది బుధవారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. నవ్య డిగ్రీ చదవడంతో పాటు సాఫ్ట్‌వేర్ కోర్సులు చేసింది. పలు ఇంటర్వ్యూలకు హాజరైంది. కానీ ఉద్యోగం దొరకలేదు.ఇక ఉద్యోగం రాదనే బెంగతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Similar News
News November 5, 2024
కూటమి నాయకులతో ఇన్‌ఛార్జి మంత్రి సమీక్ష
కడప జిల్లాలోని ఎన్డీఏ కూటమి నాయకులతో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సవిత సమీక్ష నిర్వహించారు. మంగళవారం కడపలోని రహదారులు భవనాల శాఖ అతిథి గృహం నందు ఎన్డీఏ కూటమి నాయకులతో నిర్వహించిన సమావేశంలో జిల్లాలోని ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్చార్జులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. భవిష్యత్తులో కూటమినేతలు కలిసికట్టుగా చేపట్టాల్సిన అంశాలపై చర్చించారు.
News November 5, 2024
శ్రీ సత్యసాయి జిల్లాలో దారుణం.. మూగ మహిళపై అత్యాచారం!
శ్రీ సత్యసాయి జిల్లాలో అత్తాకోడళ్లపై అత్యాచార ఘటన మరువక ముందే మరో దారుణం జరిగింది. సోమందేపల్లి మండలంలోని ఓ గ్రామంలో సోమవారం రాత్రి ఓ మూగ మహిళపై ఆదే గ్రామానికి చెందిన రామాంజి అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధిత మహిళ మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా నిందితుడిపై ఇప్పటికే పలు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
News November 5, 2024
14న అనంత జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్
ఉమ్మడి అనంత జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని కోర్టుల్లో డిసెంబర్ 14న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించి మోటార్ వాహనాల ప్రమాద కేసులు, సివిల్, చెక్‌బౌన్స్ కేసులు, కుటుంబ తగాదాలు, పారిశ్రామిక వివాదాలు, రాజీ చేయదగిన క్రిమినల్ కేసులను జాతీయ లోక్ అదాలత్‌లో రాజీ చేస్తారని తెలిపారు.