News March 29, 2024
అనంత: ఎనిమిది కాళ్లతో గొర్రె పిల్ల జననం
పుట్టపర్తి మండలలో శుక్రవారం వింత గొర్రె పిల్ల పుట్టింది. మండల పరిధిలోని సుబ్బరాయునిపల్లి గ్రామానికి చెందిన గొర్రెల కాపరి మూర్తికి చెందిన ఓ గొర్రె ఎనిమిది కాళ్లు, రెండు తలలతో కూడిన గొర్రె పిల్లకు జన్మనిచ్చింది. కాగా కొద్ది సేపటికే గొర్రె పిల్ల మృతి చెందినట్లు గొర్రెల కాపారి తెలియజేశారు.
Similar News
News February 5, 2025
నేడు అనంతపురంలో హార్టికల్చర్ కాంక్లేవ్
అనంతపురంలోని MYR ఫంక్షన్ హాలులో ఇవాళ ఉదయం 9 గంటలకు హార్టికల్చర్ కాంక్లేవ్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వినోద్కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కాంక్లేవ్ సమావేశంలో హార్టికల్చర్ యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లతో పాటు 16 మంది దేశ, విదేశాలకు చెందిన కార్పొరేట్ ప్రతినిధులు పాల్గొననున్నారు. ఇందులో భాగంగా అనంతపురం జిల్లాతో 6 MOUలు కురుర్చుకోనున్నారు.
News February 5, 2025
అనంతపురంలో నేత్ర స్వీకరణ కేంద్రం ప్రారంభం
అనంతపురం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం డీవై కుళ్లాయప్ప నేత్ర స్వీకరణ కేంద్రం ప్రారంభమైంది. కార్యక్రమానికి కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో రెడ్ క్రాస్ శరవేగంగా దూసుకుపోతోందని, ఇప్పటికే మెంబర్షిప్, సీఎస్ఆర్ కార్యక్రమంలో రాష్ట్రంలోనే ముందు ఉన్నామని తెలిపారు. కంటి దాన అంగీకార పత్రాల సేకరణలోనూ మన రెడ్ క్రాస్ ముందుండాలన్నారు.
News February 4, 2025
కిలో టమాటా రూ.14, టన్ను చీనీ రూ.19వేలు
అనంతపురంలో టమాటా ధరలు రైతులకు నిరాశే మిగిలిస్తున్నాయి. కక్కలపల్లి మార్కెట్లో నిన్న కిలో టమాటా రూ.14 పలికింది. సరాసరి ధర రూ.11, కనిష్ఠ ధర రూ.7తో విక్రయాలు జరిగాయి. టమాటా కోత కూలీలు, ఖర్చులు కూడా రావడంలేదని రైతులు వాపోతున్నారు.
➤ ఇక చీనీ ధరలు కూడా భారీగా పడిపోయాయి. నిన్న టన్ను గరిష్ఠంగా కేవలం రూ.19వేలతో అమ్ముడయ్యాయి. కనిష్ఠంగా రూ.8వేలు పలికాయి.