News April 13, 2025
అనంత: ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలికి తృటిలో తప్పిన ప్రమాదం

అనంతపురం జిల్లా గుత్తికి చెందిన ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ రుకియ బేగం ఆదివారం నెల్లూరుకు వెళుతుండగా.. ఎదురుగా వస్తున్న బైక్ ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని ఆమె భర్త రియాజ్ పేర్కొన్నారు. త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పిందని ఆమె కాలికి తీవ్ర గాయాలు అయ్యాయని అన్నారు. తిరుపతి శివారులలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి ఆమె చికిత్స పొందుతుందన్నారు.
Similar News
News December 21, 2025
పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దాం: DMHO

పల్స్ పోలియోలో భాగంగా వజ్రకరూరు మండల కేంద్రంలోని PHCని ఆదివారం DMHO డాక్టర్ భ్రమరాంబ దేవి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా పలు రికార్డులు, వార్డులను తనిఖీ చేశారు. అనంతరం పల్స్ పోలియో కేంద్రాలలో పల్స్ పోలియో చుక్కలు ఎంతమంది పిల్లలకు వేశారని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు త్యాగరాజు, గంగాధర్, మండల వైద్యాధికారులు డాక్టర్ తేజస్వి, సర్దార్ వలి ఉన్నారు.
News December 21, 2025
2,84,774 మంది చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు: DMHO

అనంతపురం జిల్లాలో 0-5 ఏళ్ల మధ్యగల 2,84,774 మంది చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేయనున్నట్లు DMHO దేవి తెలిపారు. జిల్లాలోని 82 యూనిట్లలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. 1,785 పోలింగ్ బూత్లలో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం 5,247 మంది సిబ్బందిని నియమించామన్నారు.