News March 23, 2024
అనంత: ఏప్రిల్ 1 నుంచి పది స్పాట్ ప్రారంభం

అనంతపురం జిల్లాలో ఏప్రిల్ 1 నుంచి 10 వరకు పది స్పాట్ ప్రారంభం కానుంది. నగరంలోని కేఎస్ఆర్ ప్రభుత్వ బాలికల పాఠశాలలో క్యాంప్ ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం విద్యాశాఖ అన్ని ఏర్పాటు సిద్ధం చేస్తోంది. అప్పుడే జవాబు పత్రాలు రావడం ప్రారంభ మయ్యాయి. ఇవన్నీ స్ట్రాంగ్ రూములో భద్రపరుస్తున్నారు. ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. జవాబు పత్రాలు దిద్దేందుకు ఒక్కో పేపర్‌కు ₹6.60 నుంచి ₹10కి పెంచారు.
Similar News
News February 6, 2025
మంత్రి పయ్యావులకు సీఎం ర్యాంక్

సీఎం చంద్రబాబు మంత్రులకు ర్యాంకులు ఇచ్చారు. గతేడాది జూన్ 12న మంత్రులుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డిసెంబర్ వరకు ఫైళ్ల క్లియరెన్స్‌లో పనితీరు ఆధారంగా సీఎం ఈ ర్యాంకులను ప్రకటించారు. ఇందులో అనంతపురం జిల్లా మంత్రి పయ్యావుల కేశవ్ 24వ ర్యాంక్ సాధించారు. ఇకపై ఫైళ్లను వేగంగా క్లియర్ చేయాలని సూచించారు.
News February 6, 2025
పల్లకీ సేవలో పాల్గొన్న ఎమ్మెల్యే బండారు శ్రావణి

బుక్కరాయసముద్రంలో కొండమీద వెంకటరమణ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బుధవారం ఉత్సవాల్లో ఎమ్మెల్యే బండారు శ్రావణి పాల్గొన్నారు. గ్రామంలో వెంకటరమణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే బండారు శ్రావణి, టీడీపీ నాయకుడు శ్రీరామ్ రెడ్డి, ఈవో రమేశ్ ఆధ్వర్యంలో స్వామిని పల్లకీలో ఉంచి గ్రామంలో ఊరేగించారు. దేవరకొండపైకి తీసుకెళ్లారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
News February 5, 2025
పరిటాల సునీతను ఆప్యాయంగా పలకరించిన జేసీ

అనంతపురంలో ‘అనంత ఉద్యాన సమ్మేళనం’ జరుగుతోంది. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రజాప్రతినిధులు తరలివచ్చారు. ఈ క్రమంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఈ దృశ్యం అక్కడున్న వారందరినీ ఆకర్షించింది. గతంలో ఈ రెండు కుటుంబాల మధ్య వైరం ఉందన్న చర్చ ఉంది. 2014లో జేసీ ఫ్యామిలీ టీడీపీలో చేరగా అప్పటి నుంచి రెండు కుటుంబాలు ఒకే పార్టీలో ఉన్నాయి.