News February 26, 2026
అనంత: ‘ఏ తల్లి కన్న బిడ్డో.. ఇంకా జాడ లేదు’

బొమ్మనహాల్ మండలం నేమకల్లులో గుర్తు తెలియని వ్యక్తులు పసికందును వదిలేసి వెళ్లిన ఘటనలో ఆ బిడ్డ ఎవరనే విషయం 24 గంటలైనా తేలలేదు. అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రి మదర్ మిల్క్ న్యూట్రీషన్ సెంటర్‌లో వైద్యుల పర్యవేక్షణలో ప్రస్తుతం చికిత్స పొందుతోంది. ఉన్నతాధికారులు ఎవరూ అక్కడికి వెళ్లి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న దాఖలాలు లేవు. ICDS, వైద్య ఆరోగ్య శాఖ అధికారుల మధ్య సమన్వయం లేదని తెలుస్తోంది.
Similar News
News April 19, 2026
హైదరాబాద్: ప్రతి ఒక్కరూ 20% నీటిని ఆదా చేయాలి

వేసవి దృష్ట్యా వచ్చే 45 రోజులు అత్యంత కీలకమని, ప్రతి ఒక్కరూ 20 శాతం నీటిని ఆదా చేయాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి కోరారు. నగరంలో నీటి సరఫరాపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. గత నాలుగేళ్లతో పోలిస్తే ట్యాంకర్ల డిమాండ్ భారీగా పెరిగిందని, సరఫరా 52 వేల నుంచి లక్షా 8 వేలకు చేరిందన్నారు. కేవలం 20 శాతం ప్రాంతాల్లోనే అధిక డిమాండ్ ఉందని, నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.

పాకాల: హైవేపై వాహనం ఢీకొని వ్యక్తి మృతి

పాకాల నేండ్రగుంట ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద శనివారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందారు. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మృతదేహం రెండు ముక్కలై గుర్తుపట్టలేని స్థితిలో పడి ఉంది. ఘటనాస్థలిలో దొరికిన డ్రైవింగ్ లైసెన్స్ ప్రకారం తమిళనాడు వేలూరు జిల్లాకు చెందిన ‘సతీష్’గా తెలుస్తోంది. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.