News April 29, 2024
అనంత: ఒకే ఊరి ప్రజలు ఇద్దరి MLAలను ఎన్నుకుంటారు
అనంతపురం జిల్లాలోని కొండేపల్లిలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఒక్కటే గ్రామం అయినప్పటి శింగనమల, తాడిపత్రి నియోజకవర్గాల పరిధిలో ఉండటం విశేషం. దీంతో ఆ ఊరి ఓటర్లు ఇద్దరు ఎమ్మెల్యేలను ఎన్నుకొంటారు. 2009కి ముందు గ్రామస్థులు ఇద్దరు ఎంపీలను ఎన్నుకునేవారు. పుట్లూరు మండల పరిధిలోని ఓటర్లు హిందూపురం లోక్ సభ, ధర్మవరం అసెంబ్లీ స్థానాల పరిధిలో ఉండేవారు. పునర్విభజన అనంతరం వీరిని శింగనమల నియోజకవర్గంలోకి తెచ్చారు.
Similar News
News January 3, 2025
తాడిపత్రిలో నటి మాధవీ లతపై పోలీసులకు ఫిర్యాదు
తాడిపత్రిలో సినీ నటి మాధవీ లతపై రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ కమలమ్మ, మహిళా కౌన్సిలర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పట్టణంలోని టౌన్ పోలీస్ స్టేషన్కు చేరుకుని ఎస్ఐ గౌస్ బాషాకు ఫిర్యాదు పత్రాన్ని అందించారు. గత నెల 31న జేసీ పార్క్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంపై మాధవీ లత తప్పుడు ఆరోపణలు చేశారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరారు.
News January 3, 2025
రాష్ట్రస్థాయిలో ధర్మవరం బాలికలకు ద్వితీయ స్థానం
రాష్ట్ర స్థాయి బాస్కెట్ బాల్ ఇంటర్, స్కూల్, స్టేట్ లెవెల్ టోర్నమెంట్లో ధర్మవరం బాలికల జట్టు రాణించి రన్నర్స్గా (ద్వితీయ స్థానం) నిలించింది. ఈ మేరకు అనంతపురం ఉమ్మడి జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ సెక్రటరీ శెట్టిపి జయచంద్రా రెడ్డి గురువారం తెలిపారు. గత నెల 28, 29, 30వ తేదీలలో చిత్తూరులో జరిగిన టోర్నమెంట్లో ధర్మవరం జట్టుపై బంగారుపాలెం జట్టు 2 పాయింట్లతో గెలిచి మొదటి స్థానం కైవసం చేసుకుందన్నారు.
News January 3, 2025
శ్రీ సత్యసాయి: పాఠశాలలో క్షుద్ర పూజల కలకలం
శ్రీ సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం కునుకుంట్లలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. ప్రభుత్వ పాఠశాల ఆవరణలో గుర్తుతెలియని వ్యక్తులు ముగ్గు వేసి అందులో ఎనుము పుర్రెను పెట్టి పూజలు చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో గ్రామస్థులు భయభ్రాంతులకు గురవుతున్నారు. తాడిమర్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.