News June 4, 2024

అనంత: గరిష్ఠ ధర రూ.38,000

image

అనంతపురం వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం చీనీకాయలు టన్ను గరిష్ఠంగా రూ.38 వేలు, కనిష్ఠంగా రూ.15 వేలు, సరాసరి రూ.25 వేలతో అమ్ముడుపోయినట్లు మార్కెట్‌ ఎంపిక శ్రేణి కార్యదర్శి జయలక్ష్మి తెలిపారు. సోమవారం అనంతపురం మార్కెట్‌కు మొత్తంగా 720 టన్నుల చీనీకాయలు వచ్చాయని జయలక్ష్మి తెలిపారు. మార్కెట్లో చీనీకాయలు గరిష్ఠంగా రూ. 38 వేలతో అమ్ముడు పోవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు.

Similar News

News November 17, 2024

అనంత: నేడు నిశ్చితార్థం.. అంతలోనే విషాదం

image

తాడిపత్రి మండలం వెంకటరెడ్డిపల్లి వద్ద నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన గీతా అనే యువతి మృతిచెందిన విషయం విధితమే. ఆ యువతికి నేడు నిశ్చితార్థం జరగాల్సి ఉంది. ఈ ఘటనతో ఇరు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. గీత, ఆమె తమ్ముడు నారాయణరెడ్డి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ట్రాక్టర్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందింది. తమ్ముడికి తీవ్ర గాయాలయ్యాయి.

News November 17, 2024

రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలి:  ఎస్పీ

image

అనంతపురం జిల్లాలో రోడ్డు భద్రత నిబంధనలు ఉల్లంఘించిన వారి పై 24 గంటల్లో 513 కేసులు నమోదు చేసి రూ.1.10 లక్షలు జరిమానాలు వేసినట్లు ఎస్పీ జగదీశ్ తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపిన 50 మందిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని తెలిపారు. మద్యం తాగి అతివేగంగా వాహనాలు నడపరాదని తెలిపారు.

News November 16, 2024

డీఎస్సీ కోచింగ్ సెంటర్‌ను సద్వినియోగం చేసుకోండి: కలెక్టర్

image

ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డీఎస్సీ కోచింగ్ సెంటర్‌ను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీ నారాయణ పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ వినోద్ కుమార్‌తో కలిసి కోచింగ్ సెంటర్‌ను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. పేద విద్యార్థులు ఇబ్బంది లేకుండా ఉండాలని ఈ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.