News July 13, 2024

అనంత: గర్భం దాల్చిన బాలిక.. యువకుడిపై పోక్సో కేసు

image

అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలంలోని ఓ బాలిక తల్లిదండ్రులు మృతి చెందారు. దీంతో పిన్నమ్మతో కలిసి ఉంటోంది. అదే గ్రామానికి చెందిన భాస్కర్ బాలికకు పరిచయమయ్యాడు. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. గర్భం దాల్చిన విషయం తెలిసి ముఖం చాటేశాడు. ఎస్సై నరేశ్ ఇద్దరినీ గుంతకల్లు డీఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడ విచారణ చేపట్టి యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వివరించారు.

Similar News

News December 11, 2025

BREAKING: కళ్యాణదుర్గం మున్సిపల్ ఛైర్ పర్సన్‌గా గౌతమి

image

కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. మున్సిపల్ ఛైర్ పర్సన్‌గా తతలారి గౌతమి ఎన్నికయ్యారు. ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే సురేంద్ర బాబు ఓటు హక్కును వినియోగించుకున్నారు.

News December 11, 2025

అనంతపురం కలెక్టర్‌కు 22వ ర్యాంకు

image

అనంతపురం జిల్లా కలెక్టర్‌ ఆనంద్‌కు సీఎం చంద్రబాబు రాష్ట్రంలో 22వ ర్యాంక్ ఇచ్చారు. కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన.. తనదైన శైలిలో పనిచేస్తూ ఎప్పటికప్పుడు ఫైల్స్ క్లియర్ చేస్తున్నారు. బాధ్యతలు చేపట్టాక మొత్తం 930 ఫైల్స్ స్వీకరించారు. వాటిలో 863 ఫైల్స్ క్లియర్ చేశారు. ఈయన ఒక్కో ఫైల్ క్లియర్ చేయడానికి సగటున 5 రోజుల 22 గంటల సమయం తీసుకున్నారు.

News December 9, 2025

వాహనదారులారా.. రూల్స్ అతిక్రమించకండి: ఎస్పీ

image

అనంతపురం జిల్లా పోలీస్ అధికారులకు ఎస్పీ జగదీశ్ పలు సూచనలు చేశారు. వాహనదారులపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. వేగం, ప్రమాదకర డ్రైవింగ్, మద్యం మత్తు, నిద్రమత్తు డ్రైవింగ్‌ను పూర్తిగా నివారించాలన్నారు. ట్రాఫిక్ పోలీసుల సూచనలు, రోడ్డు సంకేతాలను వాహనదారులు కచ్చితంగా పాటించాలన్నారు. బండి పత్రాలు ఉండాలని, హెల్మెట్/సీటు బెల్ట్ తప్పనిసరిగా వాడలని, లేనిచో చట్టపరంగా చర్యలు చేపడతామని హెచ్చరించారు.