News April 19, 2024
అనంత: చీనీకాయలు టన్ను గరిష్ఠ ధర రూ.37 వేలు
అనంతపురం వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం చీనీకాయలు టన్ను గరిష్ఠ ధర రూ.37 వేలు పలికింది. కనిష్ఠ ధర రూ.19 వేలు, సరాసరి ధర రూ.26 వేలతో అమ్ముడుపోయినట్లు మార్కెట్ ఎంపిక శ్రేణి కార్యదర్శి జయలక్ష్మి తెలిపారు. మార్కెట్ కు మొత్తం 991 టన్నుల చీనీకాయలు వచ్చాయని జయలక్ష్మి వెల్లడించారు. .
Similar News
News September 19, 2024
సోమందేపల్లిలో ఇద్దరికి 6 నెలల జైలు శిక్ష
సత్యసాయి జిల్లా సోమందేపల్లిలో ఇద్దరికి జైలు శిక్ష విధించినట్లు ఎస్ఐ రమేశ్ బాబు తెలిపారు. నాగినాయనిచెరువు బాబయ్య (2016లో) కరెంట్ షాక్‌తో మృతి చెందారు. ఈ కేసులో సోమందేపల్లి డిష్ ఆపరేటర్ మహేశ్, లైన్‌మెన్ శంకర్ రెడ్డిపై అప్పటి ఎస్ఐ ఛార్జిషీట్ కోర్ట్‌లో ఫైల్ చేశారు. నేరం రుజువు కావడంతో ఇద్దరికీ 6 నెలల జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.10 వేలు జరిమానా విధించారన్నారు.
News September 19, 2024
ఫ్రీ హోల్డ్ భూముల రిజిస్ట్రేషన్ పరిశీలన 25 లోగా పూర్తి కావాలి: కలెక్టర్
శ్రీ సత్యసాయి జిల్లాలో జరుగుతున్న ఫ్రీ హోల్డ్ భూముల రిజిస్ట్రేషన్ పరిశీలన ఈనెల 25వ తేదీ లోపు పూర్తి చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడారు. ఫ్రీ హోల్డ్ భూముల రీ వెరిఫికేషన్‌కు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలను దృష్టిలో ఉంచుకొని, క్షేత్రస్థాయిలో వాటిని పటిష్టంగా అమలు చేయాలన్నారు.
News September 19, 2024
అనంత: క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ అభిమానులకు గుడ్ న్యూస్
టీమిండియా క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ అభిమానులకు గుడ్ న్యూస్‌గా చెప్పవచ్చు. గాయం నుంచి కోలుకున్న సూర్య, అనంతపురంలోని ఆర్డీటీ స్టేడియంలో రేపు జరుగనున్న దులీప్ ట్రోఫీలో బరిలోకి దిగనున్నారు. ఇండియా-బి జట్టు తరఫున బరిలో దిగనున్నారు. సూర్యకుమార్ యాదవ్ స్కై షాట్స్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.