News April 12, 2025

అనంత జిల్లాకు 13వ స్థానం

image

ఇంటర్ ఫలితాల్లో అనంత జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. సెకండ్ ఇయర్‌లో 19,541 మంది పరీక్షలు రాయగా 15,632 మంది పాసయ్యారు. 80 శాతం పాస్ పర్సంటేజీతో అనంత జిల్లా రాష్ట్రంలోనే 13వ స్థానంలో నిలిచింది. ఫస్ట్ ఇయర్‌లో 22,824 మందికి 14,439 మంది పాసయ్యారు. 63 శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలో 17వ స్థానంలో జిల్లా నిలిచింది.

Similar News

News April 15, 2025

20న పెళ్లి.. ఇష్టం లేక యువతి ఆత్మహత్య

image

పెళ్లికూతరు కావాల్సిన యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాప్తాడు మండలంలో జరిగింది. పూలకుంట గ్రామానికి చెందిన రేణుక(24) ఆకుతోటపల్లి-1 సచివాలయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఆమెకు కళ్యాణదుర్గానికి చెందిన యువకుడితో ఈ నెల 20న వివాహం జరగాల్సి ఉంది. ఇంట్లో సందడి మొదలవగా యువతికి ఈ పెళ్లి ఇష్టం లేదు. ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పలేక ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.

News April 15, 2025

రుణాలు సద్వినియోగం చేసుకోవాలి: అనంతపురం కలెక్టర్

image

విభిన్న ప్రతిభావంతులు స్వయం ఉపాధి పథకంలో రుణాలు, ఉపకరణాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం నగరంలోని జిల్లా పరిషత్‌లో ఉన్న డీపీఆర్‌సీ సమావేశ మందిరంలో ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతుల, రుణాలు పంపిణీ కార్యక్రమంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పాల్గొన్నారు.

News April 15, 2025

అనంత: విపత్తుల సమయంలో అగ్నిమాపక సేవలు గ్రేట్

image

విపత్తుల సమయంలో అగ్నిమాపక సేవలు అభినందనీయమని జిల్లా జడ్జి శ్రీనివాసులు పేర్కొన్నారు. సోమవారం అనంతపురంలోని అగ్నిమాపక కార్యాలయంలో అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా గోడపత్రికలను ఆవిష్కరించారు. ఫైర్ సర్వీస్ సభ్యులు అగ్ని తీవ్రతను తగ్గించడంలో, కానీ ప్రజల ప్రాణాలను, ఆస్తులను కాపాడడంలో మంచి నైపుణ్యత కనబరుస్తారని జడ్జి తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.

error: Content is protected !!