News August 3, 2024

అనంత జిల్లాకు 40 మంది తహశీల్దార్లు బదిలీ..!

image

అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఎన్నికల బదిలీలలో కర్నూలు, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలకు వెళ్లిన తహశీల్దార్లు తిరిగి సొంత జిల్లాకు వచ్చారు. జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తహశీల్దార్లకు ఆయా మండలాల వారీగా స్థానాలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే వారికి కేటాయించిన స్థానాలలో జాయిన్ కావాలని సూచించారు.

Similar News

News December 7, 2025

అనంతపురంలో రేపు ప్రజా వేదిక: కలెక్టర్

image

అనంతపురం కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహిస్తామని కలెక్టర్ ఆనంద్ ఆదివారం తెలిపారు. కాల్ సెంటర్ 1100ను అందరికీ అందుబాటులో ఉంచామన్నారు. అర్జీలు పరిష్కారం కాకపోయినా, అర్జీల పరిస్థితిని తెలుసుకోవాలన్నా 1100కు కాల్ చేసి తెలుసుకోవచ్చన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు నిర్వహిస్తామన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News December 7, 2025

మత్తు పదార్థాలు ఆరోగ్యానికి హానికరం: ఎస్పీ

image

ఆరోగ్యవంతమైన సమాజానిర్మానానికి ప్రతిఒక్కరూ ముందుకు రావాలని SP జగదీశ్ పేర్కొన్నారు. ఆదివారం అనంతపురంలో ‘డ్రగ్స్ వద్దు బ్రో-సైకిల్ తొక్కు బ్రో’ అవగాహన సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. డ్రగ్స్‌ యువత భవిష్యత్తును దెబ్బతీసే తీవ్రమైన సమస్య అన్నారు. ఈ ర్యాలీ వంటి కార్యక్రమాలు యువతలో అవగాహన పెంచడంతో పాటు ఆరోగ్యకరమైన అలవాట్లను ప్రోత్సహిస్తాయన్నారు. మత్తు పదార్థాలకు ఆరోగ్యానికి హానికరమన్నారు.

News December 7, 2025

దేశ రక్షణలో సైనికుల త్యాగాలు వెలకట్టలేనివి: కలెక్టర్

image

దేశ రక్షణలో సైనికులు, మాజీ సైనికుల త్యాగాల వెలకట్టలేని కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. ఆదివారం అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో సాయుధ దళాల పతాక నిధికి తన వంతు విరాళాన్ని హుండీలో వేశారు. అనంతరం సాయుధ దళాల పథక దినోత్సవ వేడుకలను ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో మాజీ సైనికులకు, అమరులైన సైనిక కుటుంబాలకు భూ పంపిణీ కోసం చర్యలు చేపట్టామన్నారు.