News June 21, 2024
అనంత జిల్లాలో బీసీ సంక్షేమ హాస్టల్ కోసం దరఖాస్తు చేసుకోండి
అనంత జిల్లాలోని బీసీ సంక్షేమ వసతి గృహాల్లో ఖాళీగా ఉన్న సీట్ల కోసం అర్హులైన విద్యార్థుల దరఖాస్తులు చేసుకోవాలని బీసీ సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ కుష్బుకొఠారి తెలిపారు. తాడిపత్రి, కళ్యాణదుర్గం, అనంతపురం డివిజన్ల పరిధిలోని 38 ప్రీమెట్రిక్ వసతి గృహాల్లో బాలురకు 3,103, బాలికలకు 1,364 సీట్లు ఖాళీ ఉన్నాయన్నారు. 17 పోస్ట్ మెట్రిక్ వసతి గృహాల్లో బాలురకు 622, బాలికలకు 547 సీట్లు ఉన్నట్లు తెలిపారు.
Similar News
News September 10, 2024
అనంతపురం చేరుకున్న భారత్-ఏ, బీ జట్ల ప్లేయర్లు
అనంతపురంలో దులీప్ ట్రోఫీ రెండో రౌండ్ క్రికెట్ పోటీలు ఈ నెల 12 నుంచి ప్రారంభం కానున్నాయి. బెంగళూరులో తొలి మ్యాచ్ ఆడిన భారత్-ఏ, బీ జట్లు నిన్న రాత్రి అనంతపురానికి చేరుకున్నాయి. కేఎల్ రాహుల్, దూబే, పంత్, మయాంక్, రియాన్ పరాగ్ తదితర క్రికెటర్లకు హోటళ్లలో ఘన స్వాగతం పలికారు. క్రికెట్లరను చూడటానికి అభిమానులు హోటల్ వద్ద పడిగాపులు కాశారు. క్రికెటర్లు బస చేసే హోటళ్ల వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.
News September 10, 2024
తాడిపత్రిలో అగ్నిప్రమాదం
తాడిపత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. పట్టణంలోని ఓ షాపింగ్ మాల్‌లో మంటలు ఎగసిపడ్డాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేస్తున్నారు. షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News September 10, 2024
అనంతపురంలో వినాయక నిమజ్జనం ఏర్పాట్లు పూర్తి: ఎస్పీ
అనంతపురంలో ఈ నెల 11న జరగనున్న వినాయక నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎస్పీ జగదీశ్ తెలిపారు. సాయంత్రం 4 గంటలకు విగ్రహాల ఉరేగింపు ప్రారంభం కావాలని తెలిపారు. 10 అడుగుల కంటే ఎత్తయిన విగ్రహాలను పంపనూరు కెనాల్లో, 10 అడుగులకు తక్కువ విగ్రహాలను రాచన పల్లి వంకల్లో నిమజ్జనం చేయాలని తెలిపారు. పట్టణంలో ట్రాఫిక్ దారి మళ్లించినట్లు తెలిపారు. ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని కోరారు.