News October 13, 2024

అనంత జిల్లాలో రాష్ట్రస్థాయి వాల్మీకి జయంతి వేడుకలు: మంత్రి లోకేశ్

image

అనంతపురం జిల్లాలో రాష్ట్రస్థాయి వాల్మీకి జయంతిని నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. టీడీపీ బీసీల పుట్టినిల్లు అన్నారు. వారి ఆత్మ గౌరవాన్ని పెంచే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. యువగళం పాదయాత్రలో ఇచ్చిన మరో హామీని చంద్రబాబు నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం నెరవేరుస్తుందని అన్నారు. ఈనెల 17న అధికారికంగా అన్ని జిల్లా కేంద్రాలు నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేశారు.

Similar News

News November 11, 2024

నేడు ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల ప్రదానం

image

రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికైన వారికి నేడు అవార్డులను అందజేస్తున్నట్లు శ్రీ సత్యసాయి జిల్లా విద్యాశాఖ అధికారి కృష్ణయ్య పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా నుంచి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులుగా నలుగురు ఎంపికయ్యారన్నారు. కలెక్టర్ టీఎస్ చేతన్ ఆధ్వర్యంలో పుట్టపర్తిలోని సాయి ఆరామంలో వారికి అవార్డులను అందజేస్తారన్నారు.

News November 11, 2024

అనంతపురం ఎమ్మెల్యేలు అసెంబ్లీలో గళం వినిపిస్తారా?

image

నేటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు ఉమ్మడి అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. ఎన్నికల అనంతరం జరుగుతున్న తొలి బడ్జెట్ సమావేశం కావడంతో ప్రజల్లోనూ, నాయకుల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలకు ముందు గ్రామ సమస్యలు, యువతకు ఉద్యోగాలు వంటి అంశాలపై ఎన్నికైన ఎమ్మెల్యేలు హామీలు గుమ్మరించారు. మరి వాటి అమలుకు నిధులు వచ్చేలా అసెంబ్లీలో గళం వినిపిస్తారా, లేదా? మీరేమంటారు?

News November 11, 2024

తాడిపత్రిలో అర్ధరాత్రి గంజాయి బ్యాచ్ హల్‌చల్

image

తాడిపత్రి పట్టణంలోని కృష్ణాపురం ఐదో రోడ్డులో ఆదివారం రాత్రి గంజాయి బ్యాచ్ హల్‌చల్ చేసింది. కొందరి యువకులు గంజాయి సేవించి కేకలు వేస్తూ బైకులపై తిరుగుతూ హల్‌చల్  చేశారు. ప్రశ్నించిన కాలనీవాసులపై దాడికి తెగబడ్డారు. ఒక బైక్‌ను ధ్వంసం చేశారు. కాలనీవాసులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కృష్ణాపురం కాలనీకి వెళ్లి విచారణ చేపట్టారు.