News October 8, 2024

అనంత జిల్లాలో రోడ్డు ప్రమాదం.. UPDATE

image

అనంతపురం జిల్లా పామిడి పట్టణ శివారులోని శ్రీనివాస మిల్క్ డైరీ సమీపంలో గల 44 నంబర్ జాతీయ రహదారిపై సోమవారం బైక్‌ను ఐచర్ వాహనం ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో పామిడిలోని అంబేడ్కర్ కాలనీకి చెందిన లాలెప్ప తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందారు. మృతుడు గుత్తి ఏపీ మోడల్ స్కూలులో అటెండర్‌గా పని చేస్తున్నారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

Similar News

News December 6, 2025

అనంతపురంలో రెజ్లింగ్ విజేత శ్రీ హర్షకు సన్మానం

image

ఇటీవల రెజ్లింగ్ పోటీలలో బంగారు పతకం సాధించిన శ్రీహర్షను అనంతపురంలో ఏపీ స్టూడెంట్ జేఏసీ జిల్లా అధ్యక్షుడు అమర్ యాదవ్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా సన్మానించారు. ఆయన మాట్లాడుతూ.. నార్పల మండలానికి చెందిన బాల శ్రీహర్ష బంగారు పతకం సాధించడం జిల్లాకు గర్వకారణం అన్నారు. గుజరాత్‌లో నిర్వహించే అంతర్జాతీయ రెజ్లింగ్ పోటీలకు హర్ష ఎంపికయ్యారని తెలిపారు. అందులో కూడా రాణించాలని ఆకాంక్షించారు.

News December 6, 2025

చంద్రబాబూ.. గంగిరెద్దులా తలూపొద్దు: అనంత వెంకటరామిరెడ్డి

image

రైతాంగాన్ని ఆదుకునే విషయంలో కేంద్రంతో పోరాడాల్సిన చంద్రబాబు.. రైతులను పణంగా పెట్టి తన పాత కేసులను మాఫీ చేసుకుంటున్నారని వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఉందంటే అది ఇక్కడి ఎంపీల వల్లేనని గుర్తు చేశారు. ఒక్క వార్నింగ్‌ ఇస్తే కేంద్రం దిగి వస్తుందని, కానీ చంద్రబాబు మాత్రం తన స్వప్రయోజనాల కోసం కేంద్రం వద్ద గంగిరెద్దులా తలూపుతున్నారని మండిపడ్డారు.

News December 6, 2025

580 మార్కులు సాధిస్తే విమాన విహారం: ఎమ్మెల్యే సురేంద్రబాబు

image

పదో తరగతిలో 580 మార్కులు సాధించిన విద్యార్థులను మంత్రి నారా లోకేశ్ వద్దకు తీసుకువెళ్లి విమాన విహారానికి అవకాశం కల్పిస్తామని ఎమ్మెల్యే సురేంద్రబాబు తెలిపారు. కళ్యాణదుర్గం మోడల్ స్కూల్లో శుక్రవారం ఏర్పాటుచేసిన మెగా టీచర్స్, పేరెంట్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యతనిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లితండ్రులు పాల్గొన్నారు.