News May 10, 2024
అనంత జిల్లాలో 101.6 మి.మీ వర్షపాతం నమోదు

అనంతపురం జిల్లా వ్యాప్తంగా 101.6 మి.మీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. అత్యధికంగా ఉరవకొండలో 23.6 మి.మీటర్లు, యాడికి 18.4, రాయదుర్గం 16.2, విడపనకల్లు 15.2, బెలుగుప్ప 13.6, కళ్యాణదుర్గం 11.6, గుమ్మగట్ట 4.8, కంబదూరు 4.6, కనేకల్ 2.0, పెద్దపప్పూరు 1.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Similar News
News February 18, 2025
అనంతపురం జిల్లాలో మండే ఎండలు.. జాగ్రత్త!

అనంతపురం జిల్లాలో రోజురోజుకూ పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఆదివారం, సోమవారం 36.21°C నమోదైంది. దీంతో ఈ ఎండల్లో మంచినీళ్లతో పాటు తరచుగా ఇతర ద్రవపదార్థాలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా పండ్ల రసాలు, కొబ్బరినీళ్లు తీసుకోవాలని, కాస్త వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించడం బెటర్ అని నిపుణులు చెబుతున్నారు.
News February 18, 2025
JNTUతో MOU కుదుర్చుకున్న DBLNS కంపెనీ

అనంతపురం జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలను సోమవారం DBLNS కంపెనీ ప్రతినిధులు సందర్శించారు. అనంతరం విద్యార్థులకు ఉపయోగపడే లైవ్ ప్రాజెక్టులు, వర్క్ షాప్‌లు, తదితర అంశాలపై MOU కుదుర్చుకున్నారు. కార్యక్రమంలో రిటైర్డ్ ప్రొఫెసర్ శంకర్, ప్రిన్సిపల్ చెన్నారెడ్డి, యూనివర్సిటీ డైరెక్టర్ సుజాత, ఈశ్వర్ రెడ్డి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ శివకుమార్, CSE విభాగాధిపతి భారతి, పలువురు ప్రొఫెసర్లు పాల్గొన్నారు.
News February 17, 2025
104ఏళ్ల బండయ్య మాస్టారుకు సన్మానం

కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలానికి చెందిన 104ఏళ్ల బండయ్య మాస్టారుకు స్థానిక పెన్షనర్ల సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు మల్లికార్జున మాట్లాడుతూ.. బ్రిటిష్ కాలంలోనే ఉపాధ్యాయుడిగా పనిచేసిన బండయ్య 104ఏళ్ల వయసులోనూ ఆరోగ్యంగా ఉండటం గొప్ప విషయమని అన్నారు. అనంతరం సబ్ ట్రెజరీ కార్యాలయంలో సర్టిఫికేట్ ప్రదానం చేశారు.