News July 15, 2024
అనంత జిల్లాలో 91 పోస్టల్ ఉద్యోగాలు
పదో తరగతి అర్హతతో BPM/ABPM ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. అనంతపురం డివిజన్‌లో 54, హిందూపురం డివిజన్‌లో 37 పోస్టులను పోస్టల్ డిపార్ట్‌మెంట్ భర్తీ చేయనుంది. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ఎంపికైన వారికి బీపీఎం అయితే రూ.12 వేలు+అలవెన్సులు, ఏబీపీఎం అయితే రూ.10 వేలు+అలవెన్సులు జీతంగా ఇవ్వనున్నారు. పూర్తి వివరాలకు https://indiapostgdsonline.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు. SHARE IT
Similar News
News October 6, 2024
ఖరీఫ్ పంటల సాగు, సమస్యలపై శాస్త్రవేత్తల సమావేశం
బుక్కరాయసముద్రం మండలం రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానంలో ఖరీఫ్ సీజన్ పంటల సాగు, సమస్యల గురించి ప్రధాన శాస్త్రవేత్త విజయ శంకర్ బాబు ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఖరీఫ్ సీజన్‌లో జులై, సెప్టెంబర్ మాసాలలో తక్కువ వర్షపాతం వల్ల దిగుబడులు తక్కువ అయ్యే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారులతో పాటు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.
News October 5, 2024
అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలి: జేసీ
ప్రధాన మంత్రి టీబీ ముక్త భారత్ అభియాన్ కార్యక్రమం అమలపై అవగాహన కార్యక్రమం వేగవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ పేర్కొన్నారు. శనివారం స్థానిక కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లాలో టీబీ నియంత్రణకు చేపట్టే కార్యక్రమాల అమలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు.
News October 5, 2024
రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపికైన ఎనుములపల్లి విద్యార్థులు
అనంతపురంలోని న్యూటౌన్ జూనియర్ కాలేజ్ మైదానంలో ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో శనివారం జరిగిన క్రీడా పోటీల్లో పుట్టపర్తి మున్సిపల్ పరిధి ఎనుములపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. బాల్ బ్యాడ్మింటన్ అండర్-14, 17 విభాగాల్లో గౌతమి, కౌశిక్ రెడ్డి, విజయ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు పీడీ రమేశ్ బాబు తెలిపారు. వీరు పశ్చిమగోదావరి జిల్లాలో జరుగు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు.