News April 13, 2025
అనంత జిల్లా నేతలకు వైసీపీలో పదవులు

అనంతపురం జిల్లా నేతలకు వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో చోటు దక్కింది. 33 మందితో మాజీ సీఎం వైఎస్ జగన్ కమిటీని నియమించగా తలారి రంగయ్య, శంకర్ నారాయణ, శైలనాథ్, విశ్వేశ్వరరెడ్డిలకు చోటు కల్పించారు. మరోవైపు రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి పార్టీ క్రమశిక్షణ కమిటీ సభ్యులుగా నియమితులయ్యారు.
Similar News
News November 3, 2025
కట్నం వద్దు కానీ.. 10 కండీషన్స్! చదివేయండి

తనకు కట్నం వద్దు కానీ వధువు 10 కండీషన్స్‌కు ఓకే చెప్పాలని ఓ యువకుడు SMలో పోస్ట్ చేశాడు. 1.No PreWed షూట్, 2.లెహంగా బదులు చీర ధరించాలి, 3.సంప్రదాయ సంగీతం ఉండాలి. 4.దండలు ప్రశాంతంగా మార్చుకోవాలి. 5.పూజారి తంతును ఎవరూ ఆపరాదు. 6.ఫొటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ జోక్యం ఉండొద్దు. 7. అభ్యంతరకర పోజులు అడగొద్దు. 8.వేదికపై నో కిస్సెస్/హగ్స్. 9.పెళ్లి పగలే జరగాలి. 10.సాయంత్రానికి అప్పగింతలు పూర్తి చేయాలి.
News November 3, 2025
వెంకటగిరి MLA గారూ.. ఈ రోడ్డును చూడండి

రోజూ వేలాదిమంది రాకపోకలు సాగించే వెంకటగిరి-గూడూరు రోడ్డు ఇది. రూ.40 కోట్లతో పనులు ప్రారంభించారు. 8నెలల కిందట పనులు ఆపేశారు. బాలాయపల్లె-అమ్మపాలెం మధ్య రోడ్డు దారుణంగా ఉండటంతో రాకపోకలకు రెట్టింపు సమయం అవుతోంది. త్వరలోనే పనులు పూర్తి చేస్తామని MLA కురుగొండ్ల ఎప్పుడో ప్రకటించారు. ఈలోగా భారీ వర్షాలు రావడంతో ఇలా మారింది. మా MLA ఎప్పుడు పనులు చేయిస్తాడో ఏమో అని రోజూ వేలాది మంది ప్రశ్నిస్తూనే ఉన్నారు.
News November 3, 2025
పర్యటన ఏర్పాట్లు పూర్తి చేయాలి: భూపాలపల్లి కలెక్టర్

జిల్లాలోని పలిమెల, మహాముత్తారం మండలాల్లో ఈ నెల 8 నుంచి 15వ తేదీ వరకు సివిల్ సర్వీసెస్ అధికారుల బృందం పర్యటించనున్నందున, అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. సోమవారం ఐడీవోసీలో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. అధికారుల పర్యటన నిమిత్తం వారికి వసతి, భోజన సౌకర్యాలు ముందస్తుగా సిద్ధం చేయాలని అధికారులను సూచించారు.


