News April 10, 2024
అనంత: టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్సీ ఇక్బాల్

మాజీ ఏపీఎస్ అధికారి, మాజీ ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ టీడీపీలో చేరారు. బుధవారం ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఇక్బాల్‌కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇక్బాల్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం కృషి చేస్తానన్నారు. గత ఎన్నికలలో హిందూపురం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఇక్బాల్.. బాలకృష్ణ చేతిలో ఓడిపోయారు.
Similar News
News March 15, 2026
1100 సేవలను వినియోగించుకోండి: కలెక్టర్

మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్ ఆనంద్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. Meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో ప్రజలు అర్జీలు నమోదు చేసుకొని, తమ సమస్యలకు పరిష్కారం పొందాలన్నారు. రెవెన్యూ పరిధిలోని అన్ని ఫిర్యాదుల పరిష్కారానికి ప్రభుత్వ కార్యాలయాలలో మీకోసం టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్ 1100 అనే బ్యానర్‌ను ఏర్పాటు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
News March 15, 2026
అనంతపురం జిల్లాలో స్వల్పంగా పెరిగిన చికెన్ ధరలు

అనంతపురం జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు స్వల్పంగా పెరిగాయి. గుత్తిలో కేజీ చికెన్ రూ.260, స్కిన్ లెస్ రూ.280, అనంతపురంలో రూ.260, స్కిన్ లెస్ రూ.280 గుంతకల్లులో రూ.240, స్కిన్ లెస్ రూ.260కు విక్రయిస్తున్నట్లు చికెన్ షాప్ నిర్వాహకుడు షఫీ తెలిపారు. కేజీ మటన్ ధరలో రూ.750 ఎలాంటి మార్పు లేదన్నారు. గత వారంతో పోలిస్తే ఈవారం కేజీపై రూ.20 పెరిగినట్లు పేర్కొన్నారు.