News February 12, 2025
అనంత: టెన్త్ అర్హతతో 66 ఉద్యోగాలు

అనంతపురం జిల్లా (డివిజన్)లో 66 GDS పోస్టుల భర్తీకి భారత తపాలా శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. టెన్త్ అర్హతతో కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి ఉండాలి. వయసు 18-40 ఏళ్ల మధ్య ఉండాలి. టెన్త్‌లో మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జనరల్, OBC, EWS వారికి దరఖాస్తు ఫీజు రూ.100. మిగిలిన వారికి ఉచితం. మార్చి 3వ తేదీ వరకు https://indiapostgdsonline.gov.in/లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Similar News
News March 18, 2025
అరకు కాఫీ తాగిన జిల్లా ఎమ్మెల్యేలు

దక్షిణ భారతదేశంలో ఎంతో పేరు పొందిన అరకు కాఫీ స్టాల్‌ను అసెంబ్లీ మెయిన్ ఎంట్రీ లాబీలో సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ స్టాల్‌ను అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలు కాల్వ శ్రీనివాసులు, పరిటాల సునీత, బండారు శ్రావణి శ్రీ, ఎంఎస్ రాజు, గుమ్మనూరు జయరాం సహచర ఎమ్మెల్యేలతో కలిసి సందర్శించారు. అక్కడ అరకు కాఫీ ప్రత్యేకతను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సహచర ఎమ్మెల్యేలతో అరకు కాఫీ తాగారు.
News March 18, 2025
సవిత షటిల్.. పరిటాల సునీత క్యారమ్స్

విజయవాడలోని ఐజీఎంసీ స్టేడియంలో నేటి నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు జరగనున్నాయి. జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. టెన్నికాయిట్, టగ్ ఆఫ్ వార్, షటిల్ బ్యాడ్మింటన్‌లో మంత్రి సవిత పాల్గొంటారు. క్యారమ్స్‌లో ఆడేందుకు ఎమ్మెల్యే పరిటాల సునీత తన పేరును నమోదు చేసుకున్నారు. ఇక 100మీ పరుగు పందెంలో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పోటీ పడనున్నారు. విజేతలకు సీఎం బహుమతులు అందజేస్తారు.
News March 18, 2025
అనంత: మూడు నెలలకు కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలి

అనంతపురం హార్టికల్చర్ కాంక్లేవ్‌లో చేసుకున్న ఎంవోయులకు సంబంధించి రాబోయే మూడు నెలల్లో చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికను తయారు చేయాలని కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. సోమవారం హార్టికల్చర్ కాంక్లేవ్‌లో వివిధ కంపెనీ ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. వారం రోజుల్లోగా రాబోయే మూడు నెలలకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికలను అందజేయాలని ఆదేశించారు.