News June 7, 2024
అనంత: తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టనున్న ముగ్గురు మహిళలు
ఉమ్మడి అనంతపురం జిల్లాలో నలుగురు మహిళలు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. శింగనమల నుంచి బండారు శ్రావణి శ్రీ, పెనుకొండ నుంచి సవిత, పుట్టపర్తి నుంచి పల్లె సింధూరరెడ్డి, రాప్తాడు పరిటాల సునీత గెలుపొందారు. కాగా వీరిలో పరిటాల సునీత మినహా మిగిలిన ముగ్గురు అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా ఎన్నికవడం ఇదే మెదటిసారి కావడం గమనర్హం. వారిలో పల్లె సింధూరరెడ్డి, సవిత మెుదటిసారి ఎన్నికల బరిలో నిలిచి గెలుపొందారు.
Similar News
News December 10, 2024
త్వరితగతిన ప్రజా సమస్యలు పరిష్కరించాలి: కలెక్టర్ చేతన్
రెవెన్యూ సదస్సులలో వస్తున్న ప్రజా ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ చేతన్ పేర్కొన్నారు. మంగళవారం శనివారం గ్రామ సచివాలయంలో తహశీల్దార్ సౌజన్య లక్ష్మీ అధ్యక్షతన జరిగిన రెవెన్యూ సదస్సుకు ఆయన హాజరయ్యారు. ప్రజల కోసం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సదస్సుల్లో 56 రకాల సర్వీసులు ఉచితంగా పొందవచ్చన్నారు.
News December 10, 2024
వసతి గృహాల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్
వసతి గృహాల నిర్మాణ మరమ్మత్తు పనులు వచ్చే సంక్రాంతి లోపు త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో పాఠశాల విద్యాశాఖకు సంబంధించిన విద్య అనుబంధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
News December 10, 2024
అనంతపురంలో కేజీ టమాటా రూ.20
టమాటా ధరలు పడిపోయాయి. అనంతపురం కక్కలపల్లి మార్కెట్‌లో నిన్న మొన్నటి వరకు కిలో రూ.30 నుంచి రూ.40 వరకు పలుకుతుండగా తాజాగా రూ.20కి చేరింది. కనిష్ఠంగా రూ.5, సరాసరి రూ.10తో విక్రయాలు సాగుతున్నాయి. మరోవైపు చీనీ ధరలు మాత్రం నిలకడగా ఉన్నాయి. నిన్న టన్ను గరిష్ఠంగా రూ.37,280 పలికాయి.