News October 5, 2024

అనంత: దసరా సెలవులలో ఊళ్లకు వెళ్తున్నారా..? అయితే జాగ్రత్త..!

image

అనంతపురం: దసరా పండుగ రోజుల్లో ఇళ్లకు తాళం వేసి ఊళ్లకు వెళ్లేవారు చోరీలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సీసీఎస్ సీఐ ఇస్మాయిల్ పేర్కొన్నారు. దొంగతనాలు జరుగకుండా ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. ప్రజలు సహకరించి సీసీఎస్ పోలీసులు సూచించిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కష్టపడి సంపాదించిన డబ్బులు, బంగారం దొంగల బారిన పడకుండా జాగ్రత్త వహించాలన్నారు.

Similar News

News October 6, 2024

ఖరీఫ్ పంటల సాగు, సమస్యలపై శాస్త్రవేత్తల సమావేశం

image

బుక్కరాయసముద్రం మండలం రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానంలో ఖరీఫ్ సీజన్ పంటల సాగు, సమస్యల గురించి ప్రధాన శాస్త్రవేత్త విజయ శంకర్ బాబు ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఖరీఫ్ సీజన్‌లో జులై, సెప్టెంబర్ మాసాలలో తక్కువ వర్షపాతం వల్ల దిగుబడులు తక్కువ అయ్యే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారులతో పాటు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.

News October 5, 2024

అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలి: జేసీ

image

ప్రధాన మంత్రి టీబీ ముక్త భారత్ అభియాన్ కార్యక్రమం అమలపై అవగాహన కార్యక్రమం వేగవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ పేర్కొన్నారు. శనివారం స్థానిక కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లాలో టీబీ నియంత్రణకు చేపట్టే కార్యక్రమాల అమలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు.

News October 5, 2024

రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపికైన ఎనుములపల్లి విద్యార్థులు

image

అనంతపురంలోని న్యూటౌన్ జూనియర్ కాలేజ్ మైదానంలో ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో శనివారం జరిగిన క్రీడా పోటీల్లో పుట్టపర్తి మున్సిపల్ పరిధి ఎనుములపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. బాల్ బ్యాడ్మింటన్ అండర్-14, 17 విభాగాల్లో గౌతమి, కౌశిక్ రెడ్డి, విజయ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు పీడీ రమేశ్ బాబు తెలిపారు. వీరు పశ్చిమగోదావరి జిల్లాలో జరుగు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు.