News March 19, 2024
అనంత: దొంగతనానికి వచ్చి.. విగత జీవిగా మారాడు

బత్తలపల్లి సమీపంలోని నార్సింపల్లి రోడ్డు వద్ద సోమవారం పొలంలో విద్యుత్ తీగలు చోరీ చేయడానికి వచ్చి శ్రీరాములు(32) అనే వ్యక్తి విద్యుత్ షాక్తో మృతి చెందాడని బత్తలపల్లి ఎస్సై శ్రీనివాసులు తెలిపారు. బాధితుడు పుట్టపర్తి మండలం ఎనుములపల్లికి చెందిన వ్యక్తిగా గుర్తించమన్నారు. కుటుంబ సభ్యులతో గొడవపడి గత ఆరు నెలలుగా ఇంటికి వెళ్లడం లేదన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News October 19, 2025
పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్త వహించండి: ఎస్పీ

అనంతపురం జిల్లా ప్రజలకు, జిల్లా పోలీసు సిబ్బందికి ఎస్పీ జగదీశ్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ దీపావళి మీ జీవితాలలో చీకట్లను పారదోలి మరిన్ని కాంతులు నింపాలని ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా జరుపుకునే ఈ దీపావళి పర్వదినాన ఆనవాయితీగా వచ్చే బాణసంచాను సరైన జాగ్రత్తలతో కాల్చాలని సూచించారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు.
News October 19, 2025
రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు: కలెక్టర్

అనంతపురం కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికను రద్దు చేసినట్లు కలెక్టర్ ఆనంద్ ఆదివారం ప్రకటించారు. సోమవారం దీపావళి సందర్భంగా ప్రభుత్వ సెలవు ఉన్నందున ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించడం లేదని తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు.
News October 19, 2025
నేడు అనంతపురంలో సందడి చేయనున్న సినీ నటి మీనాక్షి

సంక్రాంతికి వస్తున్నాం సినీ నటి మీనాక్షి చౌదరి ఆదివారం జిల్లాకు రానున్నారు. అనంతపురంలోని రాజీవ్ కాలనీలో ఓ షోరూం ప్రారంభోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా వస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు. ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. మంత్రి పయ్యావుల కేశవ్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు.