News March 19, 2024

అనంత: దొంగతనానికి వచ్చి..  విగత జీవిగా మారాడు

image

బత్తలపల్లి సమీపంలోని నార్సింపల్లి రోడ్డు వద్ద సోమవారం పొలంలో విద్యుత్ తీగలు చోరీ చేయడానికి వచ్చి శ్రీరాములు(32) అనే వ్యక్తి విద్యుత్ షాక్‌తో మృతి చెందాడని బత్తలపల్లి ఎస్సై శ్రీనివాసులు తెలిపారు. బాధితుడు పుట్టపర్తి మండలం ఎనుములపల్లికి చెందిన వ్యక్తిగా గుర్తించమన్నారు. కుటుంబ సభ్యులతో గొడవపడి గత ఆరు నెలలుగా ఇంటికి వెళ్లడం లేదన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News September 21, 2024

అనంత ఎస్పీ గ్రీవెన్స్‌కు 8 పిటిషన్లు

image

జిల్లా ఎస్పీ పి.జగదీశ్ జిల్లాలోని పోలీస్ సిబ్బంది సమస్యల పరిష్కారానికి శుక్రవారం గ్రీవెన్స్ నిర్వహించారు. బదిలీలు, సస్పెన్సన్ రీఓక్, ఇతర సమస్యలపై సిబ్బంది 8 పిటిషన్లు అందజేశారు. అర్జీలకు సర్వీస్ రూల్స్ ప్రకారం పరిష్కారం చూపాలని ఎస్పీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రమణమూర్తి, ఎస్పీ సీసీ ఆంజనేయ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

News September 20, 2024

కూటమి పాలనలో సంక్షేమ పథకాలన్నీ రద్దు: అనంత వెంకటరామిరెడ్డి

image

కూటమి పాలనలో సంక్షేమ పథకాలన్నీ రద్దయ్యాయని అనంతపురం మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. 100 రోజుల పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో వెనక్కు.. అవినీతిలో ముందుకు వెళ్లిందని విమర్శించారు. ఖరీఫ్ ముగిసి రబీ ప్రారంభమవుతున్నా పెట్టుబడి సాయం అందలేదని అన్నారు. జిల్లాలో ఎక్కడ చూసినా మట్టి, ఇసుక దోపిడీ జరుగుతోందని ఆరోపించారు.