News March 22, 2024
అనంత: దోపిడి ముఠాను అరెస్ట్
అనంతపురంలోని రిలయన్స్ మార్ట్‌లో దోపిడీ చేసేందుకు పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. అనంతపురం జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపిన మేరకు.. గుజ్జల రుస్యింగులు, రాగిరి శ్రీనివాసులు, గొల్ల చంటి పట్టణంలోని రిలయన్స్ మార్ట్‌తో పాటు హౌసింగ్ బోర్డ్ కాలనీలోని వర్తకుడు ఇంట్లో చోరీ చేయాలని కుట్ర పన్నారు. పక్కా సమాచారంతో వారిని అరెస్టు చేసినట్టు ఎస్పీ వెల్లడించారు.
Similar News
News September 10, 2024
వరద బాధితులకు అనంతపురం ఎమ్మెల్యే రూ.10లక్షల విరాళం
విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. సీఎం సహాయ నిధికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా సాయం కోసం ఎదురుచూస్తున్న వరద బాధితులకు అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అండగా నిలిచారు. తన వంతు రూ.10 లక్షలను విరాళంగా ప్రకటించారు. ఈ మేరకు చెక్కును సీఎం చంద్రబాబు నాయుడికి అందజేశారు. సీఎం ఎమ్మెల్యే దగ్గుపాటిని అభినందించారు.
News September 10, 2024
అనంతపురం చేరుకున్న భారత్-ఏ, బీ జట్ల ప్లేయర్లు
అనంతపురంలో దులీప్ ట్రోఫీ రెండో రౌండ్ క్రికెట్ పోటీలు ఈ నెల 12 నుంచి ప్రారంభం కానున్నాయి. బెంగళూరులో తొలి మ్యాచ్ ఆడిన భారత్-ఏ, బీ జట్లు నిన్న రాత్రి అనంతపురానికి చేరుకున్నాయి. కేఎల్ రాహుల్, దూబే, పంత్, మయాంక్, రియాన్ పరాగ్ తదితర క్రికెటర్లకు హోటళ్లలో ఘన స్వాగతం పలికారు. క్రికెట్లరను చూడటానికి అభిమానులు హోటల్ వద్ద పడిగాపులు కాశారు. క్రికెటర్లు బస చేసే హోటళ్ల వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.
News September 10, 2024
తాడిపత్రిలో అగ్నిప్రమాదం
తాడిపత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. పట్టణంలోని ఓ షాపింగ్ మాల్‌లో మంటలు ఎగసిపడ్డాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేస్తున్నారు. షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.