News May 26, 2024
అనంత: ద్విచక్ర వాహనదారుడిని ఆటోతో ఢీ కొట్టి హత్య

అనంతపురం పట్టణంలోని రెండో రోడ్డు ఫ్లైఓవర్ కింద ద్విచక్ర వాహనంపై వెళుతున్న వ్యక్తిని ఆటోతో ఢీ కొట్టి వెంబడించి హత్య చేశారు. పోలీసులు తెలిపిన మేరకు శనివారం 11 గంటల తర్వాత రహమత్ నగర్‌కు చెందిన సుగాలి జైపాల్ నాయక్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనంలో వెళుతుండగా ఆటో తో ఢీ కొట్టి ప్రమాదానికి గురి చేశారు. అనంతరం సిమెంటు దిమ్మెను అతడి తలపై వేసి దారుణంగా హత్య చేశారు.
Similar News
News February 8, 2025
సత్తా చాటిన తాడిపత్రి సబ్ డివిజన్ పోలీసులు

అనంతపురం జిల్లా కేంద్రంలో జరిగిన జిల్లా పోలీసు స్పోర్ట్ మీట్‌లో తాడిపత్రి సబ్ డివిజన్ పోలీసులు సత్తా చాటారు. దాదాపు 9 విభాగాలలో ప్రతిభ చూపినట్లు అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి పేర్కొన్నారు. ట్రోపీలను, బహుమతులను అనంతపురం రేంజ్ డీఐజీ షిమోన్షి, అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్‌లు అందజేశారు. ఈ కార్యక్రమంలో తాడిపత్రి రూరల్ సీఐ శివగంగాధర్ రెడ్డి, ఎస్సై ధరణి బాబు తదితరులు పాల్గొన్నారు.
News February 7, 2025
హీరో నాగార్జునను కలిసిన అనంతపురం ఎంపీ

ఢిల్లీలోని పార్లమెంటులో సినీ నటుడు అక్కినేని నాగార్జునను అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ కలిశారు. ప్రధాని మోదీని కలిసేందుకు పార్లమెంటుకు వచ్చిన ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఒకరినొకరు పరస్పరం యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నాగార్జున ప్రధానిని కలిశారు. అక్కినేని నాగేశ్వరరావు జీవిత చరిత్రను ప్రధాని మోదీ ఆవిష్కరించారు.
News February 7, 2025
సోమందేపల్లి మండలంలో విషాదం.. వివాహిత సూసైడ్

శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం కేతగాని చెరువులో వివాహిత హిమజ(26) పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఇవాళ ఉదయం ఆత్మహత్య చేసుకుంది. నాలుగేళ్ల క్రితం గ్రామానికి చెందిన ఆదర్శ్‌తో ఆమెకు వివాహమైంది. అప్పటి నుంచి అదే ఊరిలో దుకాణం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్నారు.