News April 24, 2024

అనంత: నేటి నుంచి డిగ్రీ పరీక్షలు

image

అనంతపురం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో మంగళవారం నుంచి డిగ్రీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పరీక్షల విభాగం సంచాలకులు ఆచార్య జీవీ రమణ తెలిపారు. ఇవాళ నుంచి ఈ నెల 29వ తేదీ వరకు యూజీ 2, 4, 6 సెమిస్టర్‌ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పరీక్షల విభాగం సంచాలకులు ఆచార్య జీవీ రమణ ఓ ప్రకటనలో తెలిపారు.

Similar News

News January 14, 2025

లండన్‌ పర్యటనలో భద్రతకు అనంతపురం కమాండర్ కావాలి: జగన్

image

YS జగన్ కుటుంబంతో కలిసి లండన్ వెళ్లనున్నారు. ఈనెల 16న జరగనున్న కుమార్తె స్నాతకోత్సవానికి వెళ్లడానికి కోర్టును అనుమతి కోరారు. అయితే లండన్‌లో తనకు సెక్యురిటీగా అనంతపురం APSP బెటాలియన్‌కు చెందిన కమాండెంట్ మహబూబ్‌ను నియమించేలా ఆదేశాలివ్వాలని సోమవారం అత్యవసర హౌస్‌మోషన్ పిటిషన్ వేశారు. దీనిపై హైకోర్టు విచారణ జరిపుతోంది. కాగా తమ వినతిపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని అధికారులను YS జగన్ కోరారు.

News January 14, 2025

రాప్తాడు: కిలో టమాటా ధర రూ.9

image

అనంతపురం జిల్లాలోని కక్కపల్లి టమాటా మార్కెట్‌లో KG టమాటా ధర రూ.9గా ఉంది. సోమవారం కక్కపల్లి మార్కెట్‌కు 1050 టన్నుల టమాటా వచ్చినట్లు యార్డ్ కార్యదర్శి రాం ప్రసాద్ రెడ్డి తెలిపారు. అయితే టమాటాకు ప్రసిద్ధి చెందిన అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి మార్కెట్‌లో సోమవారం KG టమాటా ధర రూ.14 పలికినట్లు మార్కెటింగ్ సూపర్‌‌వైజర్ తెలిపారు.

News January 14, 2025

వైసీపీ శ్రీ సత్యసాయి జిల్లా సెక్రటరీగా భాస్కర్

image

వైసీపీ శ్రీ సత్యసాయి జిల్లా సెక్రటరీగా ముదిగుబ్బ మండలానికి చెందిన సీనియర్ నాయకుడు భాస్కర్‌ను అధిష్ఠానం నియమించింది. ఈ మేరకు ఆయన సోమవారం మాట్లాడుతూ.. పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు. తన మీద నమ్మకముంచి జిల్లా సెక్రటరీగా ఎంపిక చేసిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.