News August 17, 2024
అనంత: నేడు వైద్య సేవలు నిలిపివేత

ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా నేడు జూనియర్ డాక్టర్లు చేస్తున్న సమ్మెకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మద్దతు పలికింది. అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ మనోరంజన్ రెడ్డి, అభిషేక్ రెడ్డి తెలిపారు. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు నగరం లోని అన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఓపీడీ సేవలు, అత్యవసరం కాని శస్త్రచికిత్స పూర్తిస్థాయిలో నిలిపివేస్తామన్నారు.
Similar News
News December 8, 2025
అనంత: ఈనెల 21న పల్స్ పోలియో.!

ఈనెల 21న వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టాలని అనంత జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సోమవారం ఆదేశించారు. జిల్లాలో 2,84,774 మంది చిన్నారులు ఉన్నారు. వీరందరికీ పల్స్ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని తెలిపారు. జిల్లాలోని 82 యూనిట్లలో కార్యక్రమం జరుగుతుందని అధికారులు వెల్లడించారు.
News December 8, 2025
అనంత: అనాధ పిల్లలకు హెల్త్ కార్డుల పంపిణీ

అనాధ పిల్లల కోసం ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. అనంతపురం జిల్లాలోని అనాధ పిల్లలకు హెల్త్ కార్డులను తయారు చేయించింది. అనంతపురం కలెక్టరేట్ రెవెన్యూ భవనంలో జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఈ కార్డులను పంపిణీ చేశారు. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా ఈ సేవను అందిస్తున్న సంగతి తెలిసిందే.
News December 8, 2025
అనంత: ఈనెల 10లోపు టెట్.!

అనంతపురంలో ఈనెల 10 నుంచి 21 వరకు TET పరీక్షలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ రెవెన్యూ భవనంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఎంపిక చేసిన 7 కేంద్రాల్లో సెషన్ వన్ ఉదయం 9.30 నుంచి 12 వరకు, సెషన్-2 మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 2 షిఫ్టుల్లో జరుగుతాయని వెల్లడించారు.


