News April 10, 2024
అనంత: పోలింగ్‌కు 24 వేల మంది సిబ్బంది

పోలింగ్‌కు అన్ని కేడర్ల అధికారులు, సిబ్బంది కలిపి దాదాపు 24 వేల మందిని నియమించారు. పీఓలు 2,552, ఏపీఓలు 2,715, ఓపీఓలు 9 వేలకు పైగా, పోలీసు సిబ్బంది 3,500, ఎన్నికల నిర్వహణ కమిటీల సిబ్బంది 570, నోడల్ అధికారులు 33 మంది, సెక్టార్ అధికారులు 481 మంది ఉన్నారు. వివిధ స్థాయిల్లో 33 శాఖలకు చెందిన వారికి పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని కల్పించారు.
Similar News
News April 18, 2026
ఈనెల 21న ఎస్సీ కమిషన్ ఛైర్మన్ జవహర్ అనంతపురం పర్యటన

ఈనెల 21న కే.ఎస్. జవహర్ అనంతపురం జిల్లాకు రానున్నారు. జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ తెలిపారు. ఎస్సీ సంక్షేమ పథకాల అమలు, పెండింగ్ సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాల పురోగతి, రోస్టర్ అమలు తదితర అంశాలపై సమగ్రంగా చర్చించనున్నారు. సంబంధిత శాఖల అధికారులు పూర్తి నివేదికలతో సమావేశానికి హాజరుకావాలని సూచించారు.
News April 18, 2026
తాడిపత్రిలో నేడు వాహనాల బహిరంగ వేలం

తాడిపత్రి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన 69 వాహనాలకు నేడు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు టౌన్ సీఐ ఆరోహణరావు తెలిపారు. వేలం పాటలో పాల్గొనదలచిన వారు ఆధార్ కార్డు, పాన్ కార్డు జిరాక్స్ ప్రతులతో పాటు, రూ.5,000 ముందస్తు డిపాజిట్ చెల్లించి పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ వేలం ప్రక్రియ పోలీస్ స్టేషన్ ఆవరణలోనే జరుగుతుందని, ఆసక్తి గల వారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.