News September 14, 2024
అనంత: ప్రభుత్వ లాంఛనాలతో ఏఆర్ కానిస్టేబుల్ అంత్యక్రియలు
బుక్కపట్నం మండలంలోని గరుగు తాండ గ్రామానికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ చంద్ర నాయక్ శుక్రవారం విజయవాడలో గుండెపోటుతో మృతి చెందాడు. శనివారం జిల్లా ఎస్పీ వి.రత్న ఆదేశాలతో ప్రభుత్వా లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత పోలీసు అధికారులు పాల్గొన్నారు.
Similar News
News October 9, 2024
ఎస్‌కే యూనివర్సిటీ పరీక్ష ఫలితాల విడుదల
అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో సెకండ్ సెమిస్టర్ UG రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ప్రొఫెసర్ శోభలత కమిటీ సభ్యులు ఎస్కే ఛాంబర్‌లో ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలను జ్ఞానభూమి పోర్టల్‌లో అందుబాటులో ఉంచామన్నారు. కార్యక్రమంలో రెక్టార్ ప్రొఫెసర్ వెంకటనాయుడు, రిజిస్టార్ రమేశ్ బాబు, పరీక్షల నియంత్రణ అధికారి లోకేశ్వర్, అసిస్టెంట్ రిజిస్టర్ శంకర్ పాల్గొన్నారు.
News October 9, 2024
‘ఉపకార వేతనాల కోసం దరఖాస్తులు చేసుకోండి’
శ్రీ సత్య సాయి జిల్లాలో అర్హత కలిగిన బీసీ, ఈబీసీ, సంచార కులాలకు చెందిన విద్యార్థులు ఉపకార వేతనాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి నిర్మల జ్యోతి పేర్కొన్నారు. 9, 10, ఇంటర్ చదువుతున్న విద్యార్థులు పీఎం యశస్వి ఉపకార వేతనాలు పొందేందుకు ఈనెల 15వ తేదీ లోపు 9, 10 తరగతి విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఇంటర్ చదువుతున్న వారు 30 లోపు దరఖాస్తులు చేసుకోవాలన్నారు.
News October 9, 2024
ప్రజాస్వామ్యం బతకాలంటే ఒక పేపర్ బ్యాలెట్ ఓటింగ్ ద్వారానే సాధ్యం: కేతిరెడ్డి
ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి X వేదికగా మాజీ సీఎం జగన్ చేసిన పోస్టుకు స్పందించారు. మొదటగా మనం పోరాటం చేయాల్సింది ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లపైనే అన్నారు. ఎందుకంటే ఏ ఎలక్ట్రానిక్ మిషన్లు నైనా ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉంటుందన్నారు. మన భారత దేశంలో ప్రజాస్వామ్యం బతకాలంటే అది ఒక పేపర్ బ్యాలెట్ ఓటింగ్ ద్వారానే సాధ్యమన్నారు.