News August 4, 2024

అనంత: ప్రేమ పేరుతో మోసం.. యువకుడిపై పోక్సో కేసు

image

రాయదుర్గం మండలంలోని టి.వీరాపురం గ్రామానికి చెందిన మధుకుమార్ అనే యువకుడిపై పోక్సో కేసు నమోదైంది. ఓ యువతిని పెళ్లి చేసుకున్న మధుకుమార్ ప్రేమ పేరుతో మరో బాలికను మోసం చేసినట్లు కళ్యాణదుర్గం డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. ‘14 ఏళ్ల బాలికను ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. బాలిక గర్భం దాల్చి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశాం’ అని వివరించారు.

Similar News

News January 3, 2026

అనంతపురం జిల్లాలో 60 ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

అనంతపురం జిల్లాలోని KGBVల్లో 60 నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఔట్ సోర్సింగ్ పద్ధతిలో చేపట్టే ఈ నియామకాల్లో టైప్-3 కేజీబీవీల్లో 40, టైప్-4 కేజీబీవీల్లో 20 ఖాళీలు ఉన్నాయి.
★ అర్హులు: మహిళా అభ్యర్థులు మాత్రమే..
★ దరఖాస్తు గడువు: నేటి నుంచి జనవరి 11 వరకు
★ దరఖాస్తు కేంద్రం: జిల్లా కేంద్రంలోని సమగ్ర శిక్ష కార్యాలయంలో అప్లికేషన్లు అందజేయాలని అధికారులు సూచించారు.

News January 3, 2026

‘అనంత’ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ పోస్టర్‌ ఆవిష్కరణ

image

8వ అనంత షార్ట్ ఫిలిం ఫెస్టివల్-2026 పోస్టర్‌ను కలెక్టర్ ఓ.ఆనంద్ శుక్రవారం ఆవిష్కరించారు. ఫిల్మ్ సొసైటీ అధ్యక్షుడు రషీద్ బాషా మాట్లాడుతూ.. ఏడేళ్లుగా అనంత షార్ట్ ఫిలిం ఫెస్టివల్ నిర్వహిస్తున్నామన్నారు. షార్ట్ ఫిలిం తీసిన వారి ప్రతిభను గుర్తించే విధంగా స్క్రీనింగ్ చేసి, అందులో ఉత్తమ షార్ట్ ఫిలిమ్స్ పొందిన వారికి అవార్డులను అందిస్తామన్నారు.